close

తాజా వార్తలు

Updated : 03/03/2021 20:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై గంటా స్పందన

విశాఖ: తాను పార్టీ మారుతున్నట్లు చాలాసార్లు ప్రచారం జరిగిందని.. దాన్ని ఇప్పటికీ ఖండిస్తూనే ఉన్నానని మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గంటా పార్టీ మారే అవకాశముందటూ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన స్పందించారు. విజయసాయి ఏ లక్ష్యంతో మాట్లాడారో అర్థం కావడం లేదన్నారు. సీఎంకు తాను ఎలాంటి ప్రతిపాదనలు పంపానో ఆయన చెప్పాలని గంటా డిమాండ్‌ చేశారు. 

గంటా శ్రీనివాసరావు అనుచరుడు కాశీ విశ్వనాథ్‌ బుధవారం వైకాపాలో చేరారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. జగన్‌ పాలన చూసి చాలా మంది వైకాపాలో చేరుతున్నారన్నారు. గంటా శ్రీనివాసరావు కొన్ని ప్రతిపాదనలు పంపారని.. జగన్‌ ఆమోదం తర్వాత పార్టీలోకి ఆయన వచ్చే అవకాశముందని చెప్పారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా గంటా స్పందించారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని