close

తాజా వార్తలు

Updated : 15/02/2020 18:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మెట్రో వస్తే ఓల్డ్‌సిటీ రూపురేఖలే మారతాయ్‌!

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: మెట్రో రైలు సేవలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. మెట్రో రైలు అభివృద్ధి, నిర్వహణపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమావేశానికి ఎల్‌అండ్‌టీ ఎండీ కేవీబీ రెడ్డి, మెట్రో ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ఈ సమావేశానికి హాజరుకాలేదు. ఈ సందర్భంగా జేబీఎస్‌ మెట్రో స్టేషన్‌ను  కిషన్‌రెడ్డి సందర్శించారు. జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు మెట్రోలో ఆయన ప్రయాణించారు. అనంతరం కిషన్‌రెడ్డి  మీడియాతో మాట్లాడుతూ.. ‘మెట్రోకు రవాణా వ్యవస్థను అనుసంధానించాలి. ఈ విషయమై మెట్రో, ఆర్టీసీ అధికారులతో మాట్లాడతా. మెట్రోకు రూ.1458 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది. ఇప్పటికే కేంద్రం రూ.1200 కోట్లను ఎల్‌అండ్‌టీకి ఇచ్చింది. మెట్రో రైలు వస్తే పాత నగర రూపురేఖలు మారిపోతాయి. పాత నగరానికి మెట్రో రాకుండా మజ్లిస్‌ పార్టీ అడ్డుకుంటోంది. మజ్లిస్‌ కుట్రను ప్రజలు అర్థం చేసుకోవాలి’’ అని విజ్ఞప్తి చేశారు.
 

‘‘మెట్రోకు సమాంతరంగా ఎంఎంటీఎస్‌ ఫేజ్‌-2 పూర్తి చేయాలి. యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్‌ చేపట్టడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. కేంద్ర వాటా కంటే అదనపు నిధులతో ఎంఎంటీఎస్‌ పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లిస్తే ఎంఎంటీఎస్‌ సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి’ అని చెప్పారు. ఎవరి నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్‌ నగరంలో పేదవారికి ఇళ్ల సౌకర్యం, వైద్య సౌకర్యం అందడం లేదో మంత్రి కేటీఆర్‌ చెప్పాలన్నారు. అనవసరంగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే ఏకైక అజెండాగా కేటీఆర్‌ పెట్టుకున్నారని కిషన్‌ రెడ్డి విమర్శించారు.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.