close

తాజా వార్తలు

Published : 15/03/2020 13:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదుల హతం

అనంత్‌నాగ్‌: జమ్మూ-కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఆదివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని డయాల్‌గామ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆదివారం ఉదయం భద్రతా దళాలు ఈ ప్రాంతానికి చేరుకొని గాలింపు చేపట్టాయి. వీరి కదలికల్ని పసిగట్టిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ క్రమంలో నలుగురు ఉగ్రవాదులు అక్కడికక్కడే హతమయ్యారు. వారు ఏ ముఠాకు చెందినవారో ఇంకా తెలియాల్సి ఉంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.