close

తాజా వార్తలు

Published : 30/03/2020 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతులు @31వేలు

పారిస్‌: కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 31 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో మూడింట రెండొంతుల మరణాలు ఒక్క యూరప్‌ ఖండంలో సంభవించడం అక్కడి ఈ వైరస్‌ విజృంభణకు అద్దం పడుతోంది. చైనాలోని వుహాన్‌లో వెలుగుచూసిన ఈ వైరస్‌ 183 దేశాలకు వ్యాప్తించగా.. సుమారు 6,67,090మంది దీని బారిన పడ్డట్లు ప్రముఖ న్యూస్‌ ఏజెన్సీ అసోసియేట్‌ ఫ్రాన్స్‌ ప్రెస్‌ (ఏఎఫ్‌పీ) వెల్లండించింది. అదే సమయంలో 1,34,700 మంది కోలుకున్నట్లు తెలిపింది.

* అమెరికాలో 1,24,686 మందికి కరోనా సోకగా.. 2,191 మంది మరణించారు. 2612 మంది కోలుకున్నారు.

* ఇటలీలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటి వరకు ఈ వైరస్‌ కారణంగా అక్కడ 10,023 మంది ప్రాణాలు కోల్పోయారు. 92,472 మంది వైరస్‌ బారిన పడ్డారు. 12,384 మంది కోలుకున్నారు.

* స్పెయిన్‌లో 78,747 మందికి కరోనా పాజిటివ్‌ రాగా.. 6,528 మరణించారు.

* చైనాలో (హాంకాంగ్‌, మకావు మినహాయించి) ఇప్పటి వరకు 81,394 మందికి కరోనా సోకగా.. 74,971 మంది కోలుకున్నారు. 3,295 మంది మరణించారు.

* ఇరాన్‌లో 38,309 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 2,640 మంది మరణించారు.

* ఫ్రాన్స్‌లో 37,575 మందికి కరోనా పాజిటివ్‌ తేలగా.. 2314 మంది మరణించారు.

* ఉరుగ్వే, న్యూజిలాండ్‌, మాలీ దేశాల్లో కరోనా కారణంగా తొలి మరణాలు సంభవించాయి.

* యూరప్‌ ఖండంలో ఇప్పటి వరకు 3,63,766 మందికి కరోనా సోకగా.. 22,259 మంది మరణించారు. 

* ఆసియాలో 1,04,596 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 3,716 మంది మరణించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.