close

తాజా వార్తలు

Published : 05/04/2020 16:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రభుత్వాలకు సహకరించాలి: కిషన్‌రెడ్డి

దిల్లీ: దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసులన్నింటిలో అత్యధిక శాతం కేసులు నిజాముద్దీన్‌ మర్కజ్‌ నుంచి వచ్చివవారి వల్లే సంక్రమించడం ఆందోళనకరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. దిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఇప్పటికైనా మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారందరూ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కుటుంబ సమేతంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సరైన సమయంలో స్పందించకుండా ఉండడంతో దేశవ్యాప్తంగా ఇప్పటికే అనేక కుటుంబాలు వైరస్‌ బారిన పడ్డాయని.. ఇప్పటికైనా ప్రభుత్వాలకు సహకరించాలని కోరారు. ఏ మాత్రం అలసత్వం వహించినా వారితో పాటు వారి కుటుంబసభ్యులు, ప్రజలకు అనేక సమస్యలు వస్తాయన్నారు. 

ఈ కరోనా మహమ్మారికి కులం, మతం, ప్రాంతం, వర్గం, రాష్ట్రం, దేశం అనే తేడాలు లేవని.. జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రతి ఒక్కరినీ బలితీసుకుంటుందని కిషన్‌ రెడ్డి హెచ్చరించారు. కరోనా వ్యాప్తిపై కొంత మంది సామాజిక మాధ్యమాల ద్వారా వాస్తవాలను వక్రీకరిస్తూ అసత్యాలను ప్రచారం చేయడం సరైన పని కాదన్నారు. కొంత మంది రాజకీయ పార్టీల నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని.. దానికి ఇది సరైన సమయం కాదన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ సమైక్యంగా సమస్త మానవాళి కోసం ఐక్యతతో పోరాడాల్సిన సమయమని కిషన్‌రెడ్డి చెప్పారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.