వారిసేవలకు సెల్యూట్‌: ఏపీ సీఎం జగన్‌
close

తాజా వార్తలు

Published : 10/04/2020 13:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారిసేవలకు సెల్యూట్‌: ఏపీ సీఎం జగన్‌

అమరావతి: రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు, కొవిడ్‌ ఆసుపత్రుల వైద్యులతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..‘‘ కరోనాపై యుద్ధంలో అందిస్తున్న సేవలు చాలా ప్రశంసనీయం. వైద్యులు, నర్సులు, పారామెడికల్‌, పారిశుద్ధ్య సిబ్బంది హృదయపూర్వకంగా సేవలందిస్తున్నారు. రిస్క్‌ ఉంటుందని తెలిసీ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. భయం ఉన్నా వైద్య సేవలు అందిస్తున్నందుకు సెల్యూట్‌ చేస్తున్నా. దిల్లీ నుంచి వచ్చిన వారి కారణంగానే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. వారందరినీ గుర్తించి క్వారంటైన్‌, ఐసోలేషన్‌లో ఉంచాం. మొత్తం మీద పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని నమ్ముతున్నా’’ అని సీఎం తెలిపారు. 
 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని