close

తాజా వార్తలు

Updated : 13/04/2020 13:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కేంద్ర మంత్రికీ తప్పని లాక్‌డౌన్ కష్టాలు

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తల్లి సంవత్సరీకం

దిల్లీ: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ ప్రభావం ప్రజలందరిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా ముఖ్యమైన కార్యక్రమాలకు సైతం హాజరుకాలేని పరిస్థితి నెలకొంది. ఈ లాక్‌డౌన్‌ కష్టాలు తాజాగా కేంద్ర మంత్రికీ తప్పలేదు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి గత నెల రోజులుగా దిల్లీలోనే ఉండి కరోనా కట్టడి పర్యవేక్షణ బాధ్యతలను చూస్తున్నారు. ఈ కారణంగా తన తల్లి సంవత్సరీకం నిర్వహించేందుకు స్వగ్రామానికి వెళ్లలేకపోయారు. దీంతో దిల్లీలోనే ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన భార్య, పిల్లలు, సోదరులు అందరూ స్వగ్రామం తిమ్మాపూర్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇందులో పాల్గొన్నారు. హోంశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న తాను స్వయంగా లాక్‌డౌన్‌ నియమాన్ని ఉల్లంఘించాలని అనుకోవట్లేదని ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.