close

తాజా వార్తలు

Published : 20/04/2020 12:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దేశంలో కొవిడ్‌ నియంత్రణలోనే ఉంది: కిషన్‌ రెడ్డి

దిల్లీ: ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో కొవిడ్‌ నియంత్రణలోనే ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ మినహాయింపులు నేటి నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో కిషన్‌ రెడ్డి దిల్లీలో మీడియాతో మాట్లాడారు. కొవిడ్‌ విషయంలో ప్రజలు పూర్తిస్థాయిలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. కూలీలు, కార్మికుల ఒత్తిడి దృష్ట్యా కంటైన్‌మెంట్‌, రెడ్‌జోన్‌, హాట్‌స్పాట్‌లేని ప్రాంతాల్లో కొన్ని సడలింపులు ఇచ్చినట్లు చెప్పారు. సడలింపులు ఇచ్చినా లాక్‌డౌన్‌ లక్ష్యాలను ప్రజలు గుర్తించాలని.. అదేవిధంగా సడలింపులు ఇచ్చిన ప్రాంతాల్లో ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని కోరారు. 

అదేవిధంగా పంట కోతలు ఉన్నప్పుడు నరేగా పనులు ఇవ్వడానికి వీల్లేదని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయ కార్మికులను పంట కోతలకు ఉపయోగించుకోవాలని సూచించారు. 30 శాతం సిబ్బందితో కేంద్ర కార్యాలయాలు నడవాలని కేంద్రం నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.