close

తాజా వార్తలు

Published : 06/05/2020 10:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతం

శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ ముష్కరుడు హతమయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా షార్షలీ గ్రామంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో బుధవారం ఉదయం పోలీసులు భద్రతాబలగాల సాయంతో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వీరి కదలికల్ని పసిగట్టిన ముష్కరులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతాదళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ క్రమంలో ఓ ముష్కరుడు అక్కడికక్కడే హతమయ్యాడు. మరికొంత మంది ఉగ్రవాదులు దాగిఉండొచ్చనే అనుమానంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఇటీవల ముష్కరులు, భద్రతాబలగాల మధ్య జరిగిన దాడిలో ఓ కల్నల్‌, మేజర్‌ సహా ఐదుగురు జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా సరిహద్దుల గుండా ఉగ్రవాదులు చొరబడేందుకు యత్నిస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం ఉండడంతో భద్రతా దళాలు మరింత అప్రమత్తంగా పహారా కాస్తున్నాయి. ఎక్కడికక్కడ ముష్కరుల యత్నాలను తిప్పికొడుతున్నాయి. ఈ క్రమంలో నిరంతరం తనిఖీలు, ముష్కరులను ఏరిపారేసే ఆపరేషన్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కరోనాతో ప్రపంచమంతా కొట్టామిట్టాడుతున్నా.. దాయాది దేశం మాత్రం ఉగ్రవాద ఎగుమతికి ఏమాత్రం స్వస్తి పలకడం లేదు.

ఇవీ చదవండి..
పౌరులను కాపాడి వీరమరణం


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.