close

తాజా వార్తలు

Published : 08/05/2020 18:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జనావాసాలకు దూరంగా విషవాయు పరిశ్రమలు

ఆలోచనతో ముందుకు రావాలన్న సీఎం జగన్‌

అమరావతి: విశాఖ లాంటి గ్యాస్‌ లీకేజీ ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. విష వాయువులు ఉండే పరిశ్రమలను జనావాసాల నుంచి దూరంగా తరలించేందుకు తగిన ఆలోచనలు చేయాలని సూచించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, తగిన ప్రణాళిక రూపొందించాలని దిశానిర్దేశం చేశారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం వెంటనే విడుదల చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

విశాఖ గ్యాస్‌ దుర్ఘటన అనంతరం పరిణామాలు, సహాయక చర్యలు జరుగుతున్న తీరుపై ముఖ్యమంత్రి జగన్‌  సమీక్షించారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు విశాఖ వెళ్లిన సీఎస్‌ నీలం సాహ్ని అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. దుర్ఘటన జరిగిన చోట పరిస్థితి పూర్తి అదుపులో ఉందని తెలిపారు. ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్‌ లీక్‌ నివారణ చర్యలను కలెక్టర్‌ వినయ్‌చంద్‌ వివరించారు. ట్యాంకర్‌లోని రసాయనంలో కొంత శాతం పాలిమరైజ్‌ అయ్యిందని, మిగిలినది పాలిమరైజ్‌ అవుతోందని తెలిపారు. పరిశ్రమలోని అన్ని ట్యాంకులూ భద్రంగా ఉన్నట్లు చెప్పారు.

గ్యాస్‌ లీక్‌ ఘటనపై సమగ్ర ప్రణాళికతో రావాలని అధికారులను ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఆదేశించారు. కాలుష్య నియంత్రణ మండలి క్రియాశీలకంగా ఉండాలన్నారు. కాలుష్య కారకాలపై ఫిర్యాదులు, వాటి నివారణకు పాటించాల్సిన స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. విశాఖలో విషవాయువులు ఉన్న పరిశ్రమలు ఎన్ని ఉన్నాయో లెక్క తేల్చాలని, వాటిలో జనావాసాల మధ్య ఎన్ని ఉన్నాయో చూడాలన్నారు. మళ్లీ  ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా జనావాసాలకు దూరంగా పరిశ్రమల తరలింపుపై ఆలోచన చేయాలని నిర్దేశించారు. ఘటన జరిగిన ప్రదేశంలో ఉన్న రసాయనాలను తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని, లేకుంటే ముడిపదార్థాలను పూర్తిగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనికి సంబంధించిన మార్గాలపైనా ఇంజినీర్లతో మాట్లాడాలని సీఎం సూచించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.