close

తాజా వార్తలు

Updated : 11/05/2020 09:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జిన్‌పింగ్‌తో ఫోన్‌లో ఎప్పుడూ మాట్లాడలేదు

జర్మన్‌ పత్రికవి నిరాధార ఆరోపణలు: డబ్ల్యూహెచ్‌ఓ

న్యూయార్క్‌: చైనా ఒత్తిడి మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) కరోనా వైరస్‌ వ్యాప్తి సమాచారాన్ని తొక్కిపెట్టిందని వస్తున్న ఆరోపణల్ని సంస్థ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఓ జర్మనీ మ్యాగజైన్‌లో ప్రచురితమైన కథనం నిరాధారం, అవాస్తవం అని తెలిపింది. కథనంలో పేర్కొన్నట్లుగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌, సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ మధ్య జనవరి 21న ఎలాంటి ఫోన్‌ సంభాషణ జరగలేదని వివరించింది. 

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఒత్తిడి వల్లే డబ్ల్యూహెచ్‌ఓ వైరస్‌పై ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో జాప్యం చేసిందంటూ జర్మనీకి చెందిన ఓ ప్రముఖ వారపత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈ మేరకు అధనోమ్‌తో జిన్‌పింగ్‌ జరిపిన ఫోన్‌ సంభాషణ ఆధారాలు జర్మనీ విదేశీ నిఘా సంస్థల వద్ద ఉన్నట్లు పేర్కొంది. ఒకరి నుంచి ఒకరికి ఈ వైరస్‌ వ్యాపిస్తుందన్న విషయంతో పాటు విశ్వావ్యాప్త సాంక్రమిక వ్యాధి(మహమ్మారి)గా దీన్ని ప్రకటించడానికి ఇంకొన్ని రోజులు వేచిచూడాలని జిన్‌పింగ్‌ కోరినట్లు కథనంలో పేర్కొన్నారు. చైనా విధానాల వల్ల అప్పటికే ఆరు వారాల కీలక సమయం గడిచిపోయిందని ఆరోపించారు. 

తాజాగా దీన్ని ఖండించిన డబ్ల్యూహెచ్‌ఓ జిన్‌పింగ్‌తో అధనోమ్‌ ఫోన్‌ ద్వారా ఎప్పుడూ మాట్లాడిన సందర్భాలు లేవని తెలిపింది. ఇలాంటి నిరాధార ఆరోపణల వల్ల మహమ్మారిపై ప్రపంచ దేశాలతో కలిసి సంస్థ చేస్తున్న పోరాటానికి ఆటంకం కలుగుతుందని వివరించింది. జనవరి 20న ఒకరి నుంచి ఒకరికి ఈ వైరస్ వ్యాపిస్తుందని చైనా సమాచారం అందించిందని తెలిపారు. దీన్ని నిర్ధారించుకొని రెండు రోజుల్లో డబ్ల్యూహెచ్‌ఓ దీన్ని యావత్తు ప్రపంచానికి తెలియజేసిందని గుర్తుచేశారు. అనంతరం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న తీవ్రతను కచ్చితంగా అంచనా వేసి ఫిబ్రవరి 11న మహమ్మారిగా ప్రకటించినట్లు వివరించారు. 

వైరస్‌పై ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో చైనా సహా డబ్ల్యూహెచ్‌ఓ ఘోరంగా విఫలమైందని అనేక దేశాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీంట్లో అగ్రరాజ్యం అమెరికా ముందున్న విషయం తెలిసిందే. చైనాలోని వుహాన్‌ నగరంలో ఉన్న ఓ ల్యాబ్‌ నుంచే వైరస్ వచ్చిందని ట్రంప్‌ సహా ఆయన పాలకవర్గం తీవ్రంగా ఆరోపిస్తోంది.

ఇవీ చదవండి..

టీకా రాకుంటే.. ప్లాన్‌-బీ తప్పదు

ఎయిమ్స్‌లో వైద్యుడి సాహసం


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.