జపాన్‌కు గడ్డుకాలం
close

తాజా వార్తలు

Published : 19/05/2020 03:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జపాన్‌కు గడ్డుకాలం

జపాన్‌ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో మాంద్యంలోకి జారింది. అధ్వాన రోజులు ఇంకా ముందున్నాయన్న భయాలను తెచ్చిపెట్టింది. జనవరి-మార్చిలో జపాన్‌ జీడీపీ 3.4 శాతం క్షీణించింది. ఇదే తీరు కొనసాగితే పరిస్థితి ఎంత దిగజారుతుందోనని ఆ దేశ ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఎగుమతులు 21.8%; ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడులు 17%, కుటుంబీకుల వినియోగం 3.1 శాతం చొప్పున క్షీణించడం గమనార్హం. ప్రపంచంలోనే అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్‌కు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద సవాలు ఎదురవుతోందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. జపాన్‌ ప్రభుత్వం లక్ష కోట్ల డాలర్ల(108 ట్రిలియన్‌ యెన్లు) ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని