close

తాజా వార్తలు

Published : 19/05/2020 15:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌..ఉగ్రవాది హతం

శ్రీనగర్‌: కశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మంగళవారం వేకువజామున జరిగిన ఈ ఘటనలో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. భద్రతా దళాల్లోని ఇద్దరు సభ్యులకు గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీనగర్‌లోని నవకడల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా దళాలు నిర్బంధ తనిఖీలు ప్రారంభించాయి. ఈ క్రమంలో వీరి కదలికల్ని పసిగట్టిన ముష్కరులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన బలగాలు వాటిని దీటుగా తిప్పికొట్టాయి. ఈ ఘటనలో ఓ ముష్కరుడు అక్కడికక్కడే హతమయ్యాడు. అతడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్‌కౌంటర్‌ కొనసాగుతూనే ఉంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.