close

తాజా వార్తలు

Updated : 29/05/2020 08:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాజేంద్రనగర్‌లో చిరుత సంచారం!

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: రాజేంద్రనగర్‌లో చిరుత సంచారం మరోసారి కలకలం సృష్టించింది. ఇక్కడి జాతీయ వ్యవసాయ పరిశోధనా విస్తరణ సంస్థ(మేనేజ్‌) సమీపంలోని ట్యాంక్‌ ఏరియాలో ఓ సీసీటీవీలో చిరుత సంచరించిన ఆనవాళ్లు రికార్డు అయ్యాయి. అక్కడికి దగ్గరలోనే గ్రేహౌండ్స్‌ పోలీసుల శిక్షణ కేంద్రం ఉండటంతో పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఓ సీసీటీవీలో గురువారం రాత్రి 8.30గంటల సమయంలో చిరుత అక్కడి నిర్మానుష్య ప్రాంతంలో సంచరించినట్లు అధికారులు గుర్తించారు. ఈ నెల 14న గగన్‌పహాడ్‌ సమీపంలో చిరుత సుమారు మూడు గంటలు సంచరించింది. అటవీశాఖ అధికారులు, పోలీసులు తీవ్రంగా శ్రమించినా ఆచూకీ  కనుక్కోలేకపోయారు. ఓ స్థానికుడు హిమాయత్‌సాగర్‌లో నీరు తాగుతుండగా చూసినట్లు అధికారులకు చెప్పడంతో అక్కడా గాలించారు. గురువారం చిరుత సంచరించినట్లు సీసీటీవీలో రికార్డ్‌ కావడంతో ఆయా సంస్థల అధికారులు అప్రమత్తమయ్యారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.