close

తాజా వార్తలు

Updated : 26/06/2020 14:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొవిడ్‌ రేసులో.. ముంబయిని దాటేసిన దిల్లీ

దిల్లీ: రాజధాని దిల్లీలో కరోనా వైరస్‌ నానాటికీ విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్య విషయంలో మంగళవారం నాటికి తమిళనాడును దాటిన దిల్లీ, తాజాగా ముంబయిని కూడా అధిగమించటం గమనార్హం. రెండు కోట్లకు పైగా జనాభా ఉన్న ముంబయిలో కేసుల సంఖ్య 70,878 కాగా మరణాలు 4062. ఇక సుమారు కోటి 80లక్షల జనాభా గల రాజధానిలో 73,780 కేసులు 2429 కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. ఈ గణాంకాలు దిల్లీలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితిని సూచిస్తున్నాయి.

మార్చి 2న తొలి కొవిడ్‌-19 కేసు నమోదైన దిల్లీలో ప్రస్తుతం 26,586 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక గత వారం రోజుల్లో ఇక్కడ నమోదైన కేసుల సగటు రోజుకు 3320 కాగా.. ముంబయిలో ఈ సంఖ్య కేవలం 1134గా ఉంది. ఒకప్పుడు కరోనా కేంద్రంగా ఉన్న ముంబయి.. కేసుల నమోదులో మరీ హెచ్చుతగ్గులు ఉండకుండా సమాంతరంగా ఉండేలా గత నెల నుంచి జాగ్రత్త పడుతోంది. చెన్నై ఈ స్థితిని పది రోజుల క్రితమే చేరుకుంది. అయితే, గత కొద్ది వారాలుగా పెరుగుతూనే వస్తున్న దిల్లీ కొవిడ్‌ గణాంకాలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. కరోనా కేసులు రెట్టింపయ్యే సమయం ముంబయిలో 40 రోజులు కాగా, చెన్నైలో 19.4గా ఉంది. ఇది దేశ రాజధానిలో ఈ వ్యవధి కేవలం 12.1 కావటం మరింత ఆందోళనకరం.

రాజధానిలో కరోనా కట్టడికి కేంద్ర మంత్రి అమిత్‌ షా గత వారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ చర్చల అనంతరం ‘కొవిడ్‌ రెస్పాన్స్‌ ప్లాన్‌’ అనే నూతన విధానాన్ని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రకటించారు. దీనిలో భాగంగా జులై 6కల్లా దిల్లీలోని ప్రతి ఇంట్లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు పూర్తి చేయనున్నారు. అంతేకాకుండా జూన్‌ 30 కల్లా కంటైన్‌మెంట్‌ జోన్లలో ఇంటింటా కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. దిల్లీ ప్రభుత్వం అనేక నివారణ చర్యలను తీసుకుంటున్నప్పటికీ కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. స్వయానా దిల్లీ ఆరోగ్య మంత్రి కూడా ఈ మహమ్మారి బారిన పడటం గమనించదగ్గ విషయం. జూన్‌ 24 వరకు అందిన గణాంకాల ప్రకారం.. ముంబయిలో మొత్తం కేసులు-మరణాల శాతం 5.70 కాగా... దిల్లీలో ఈ రేటు 3.36శాతం కావటం ఒక్కటే కాస్త ఊరట కలిగిస్తోంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.