పెట్టుబడులకు హైదరాబాద్‌ అనుకూలం
close

తాజా వార్తలు

Updated : 27/06/2020 02:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెట్టుబడులకు హైదరాబాద్‌ అనుకూలం

- మంత్రి హరీశ్‌రావు

పటాన్‌చెరు అర్బన్‌, న్యూస్‌టుడే: దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నా.. హైదరాబాద్‌దే భవిష్యత్తు అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పటాన్‌చెరు శివారులోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏపీఆర్‌ నిర్మాణ సంస్థ బ్రోచర్‌ను ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ.. దేశంలోనే హైదరాబాద్‌కు మంచి డిమాండ్‌ ఉందన్నారు. కరోనా వల్ల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పడిపోయిందన్నది నిజం కాదన్నారు. నగరంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయని చెప్పారు. అన్నింటికీ నగరం అనుకూలమని, పరిశ్రమలు, ఐటీకి కేంద్రంగా మారిందన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ముందుకొస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో మరిన్ని సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ఏపీఆర్‌ ప్రాజెక్టులో భాగంగా 400 ఇళ్ల నిర్మాణానికి 4వేల మందికి ఉపాధి లభించడం సంతోషంగా ఉందన్నారు. పేద, మధ్య తరగతి వర్గాల వారికి నాణ్యమైన ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రాజెక్టు యజమాని కృష్ణారెడ్డిని కోరారు. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, ఏపీఆర్‌ యజమాని సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని