కరోనా వేళ..గర్భస్రావాలకు సంకటం
close

తాజా వార్తలు

Published : 28/06/2020 09:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా వేళ..గర్భస్రావాలకు సంకటం

 లాక్‌డౌన్‌తో దేశంలో 18.5 లక్షల మందికి అందని వైద్యం

 హైదరాబాద్‌: మహిళల ఆరోగ్యంపై లాక్‌డౌన్‌ తీవ్ర ప్రభావం చూపింది. వైద్య అందుబాటులో లేకపోవడంతో దేశ వ్యాప్తంగా 18.5 లక్షల మంది మహిళలు సకాలంలో గర్భస్రావ చికిత్సలు పొందలేకపోయినట్లు అంచనా. ‘‘చాలాకాలం ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కరోనా చికిత్సా కేంద్రాలుగా మారాయి. అక్కడ అత్యవసరంగా గర్భస్రావం చేసేందుకు అవకాశాలు లేవు. ప్రైవేటు ఆసుపత్రులు కూడా మూతపడటంతో మహిళలకు వేరే మార్గం లేకుండా పోయింది’’ అని ఐపాస్‌ అభివృద్ధి ఫౌండేషన్‌ వెల్లడించింది. మహిళలకు సురక్షిత గర్భస్రావం, గర్భనిరోధక అవకాశాలపై పనిచేస్తున్న ఈ సంస్థ లాక్‌డౌన్‌-1 నుంచి 4 వరకు పరిస్థితులను అంచనా వేసింది.  గర్భం దాల్చినట్లు వెల్లడైన వెంటనే వద్దనుకుంటే సకాలంలో వైద్యుల సమక్షంలో వైద్య, శస్త్రచికిత్సల ద్వారా రక్షిత విధానంలో తొలగించుకోవాలి. తొలి రెండు లాక్‌డౌన్‌ల సమయంలో గర్భస్రావం అవసరమైన వారిలో దాదాపు 59శాతం మంది మహిళలు సంబంధిత వైద్యం పొందలేకపోయారు.  కొందరు మహిళలు అరక్షిత పద్ధతి వినియోగిస్తున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని