విందు భోజనం.. గ్రామంలో కలకలం
close

తాజా వార్తలు

Updated : 28/06/2020 09:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విందు భోజనం.. గ్రామంలో కలకలం

ఏడుగురికి పాజిటివ్‌.. ఊరంతా కంటెయిన్‌మెంట్‌

యాచారం: కరోనా ముప్పు పొంచి ఉన్నందున విందులు, వినోదాలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం ఎంతగా ప్రచారం చేస్తున్న చాలామంది పట్టించుకోవడం లేదు. చిన్న నిర్లక్ష్యం పెద్దముప్పుగా మారుతుందని చెబుతున్నా.. కొందరు ఖాతరు చేయడం లేదు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కగుట్టతండాలో ఇటీవల ఓ విందుకు హాజరైన ఒకరి ద్వారా ఏడుగురికి కరోనా సోకింది. తండాలో కంటైన్‌మెంట్‌జోన్‌ ఏర్పాటు చేయడంతో అక్కడి 40 కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. ఈనెల 12న తండాలో నిర్వహించిన విందుకు బంధువులు చాలామంది రాగా వారిలో ఎల్బీనగర్‌కు చెందిన వ్యక్తి (40) ఇక్కడ ఒకరింట్లో మూడు రోజులున్నాడు. అప్పడే అతనికి జ్వరం రావడంతో యశోద ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌ తేలింది. మూడు రోజుల క్రితం అతను బస చేసిన ఇంట్లోని మహిళ(50)కు, ఆమె కుమారుడి(32)కి కరోనా సోకింది. వీరిని హోం క్వారంటైన్‌ చేశారు. విందులో వీరితోపాటు పాల్గొన్న మరో ఐదుమందికి శనివారం కరోనా పాజిటివ్‌ వచ్చిందని మండల వైద్యాధికారి నాగజ్యోతి చెప్పారు. వీరు అబ్దుల్లాపూర్‌మెట్‌, ఆరుట్ల, ఇబ్రహీంపట్నం, సరూర్‌నగర్‌ ప్రాంతాలకు చెందిన వారని ఆమె వివరించారు. ఈవిందుకు హాజరైన మరికొందరికి కరోనా పరీక్షలు నిర్వహించామని రిపోర్టులు రావల్సి ఉందన్నారు. కంటైన్‌మెంట్‌ ప్రాంతాన్ని నాగజ్యోతి, సీఐ లింగయ్య, ఎస్సై సురేశ్‌, సర్పంచి జగదీశ్‌ పరిశీలించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని