ఊపిరి కష్టమవుతోంది.. తీసుకెళ్లరూ!
close

తాజా వార్తలు

Published : 02/07/2020 10:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఊపిరి కష్టమవుతోంది.. తీసుకెళ్లరూ!

హెల్ప్‌డెస్కుల్లో ఫోన్‌ ఎత్తని వైనం

● నానక్‌రాంగూడకు చెందిన మహిళ అవస్థ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: బుధవారం తెల్లవారుజాము 3గంటల సమయం.. నానక్‌రాంగూడకు చెందిన ఓ మహిళ తీవ్రజ్వరంతో పాటు ఊపిరి పీల్చడానికి కష్టపడుతోంది.. 104, 108 హెల్ప్‌లైన్‌ నంబర్లకు కుటుంబీకులు ఫోన్‌ చేయగా స్పందన లేదు. గంటకుపైగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. చివరకు అదే ప్రాంతంలో ఉండే సామాజిక కార్యకర్త రమణ్‌జీత్‌సింగ్‌కి ఉదయం 5గంటలకు ఫోన్‌ చేశారు. ఆయనా అత్యవసర నంబర్లను సంప్రదించినా అదే పరిస్థితి ఎదురవడంతో ఓ వాహనంలో స్థానిక ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పడకలు లేవంటూ రానివ్వలేదు. మరో ఆసుపత్రికి వెళ్లగా వెంటిలేటర్లు లేవని తిరిగి పంపారు. మూడు గంటల ప్రయాస అనంతరం ఓ ప్రభుత్వాధికారికి విషయం తెలపగా ఆయన జోక్యంతో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి చేర్చుకుంది. కరోనా పరీక్షలు చేయడంతోపాటు చికిత్సను అందించింది. అయితే ఈ మధ్యలోనే సామాజిక కార్యకర్త జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కొవిడ్‌ కంట్రోల్‌రూమ్‌కు సైతం ఫోన్‌ చేశారు. ‘‘ప్రాణం పోయే పరిస్థితి ఉంది.. ఏ ఆసుపత్రీ చేర్చుకోలేదని చెబితే.. 108కి ఫోన్‌ చేయండి.. మేము ఎటువంటి సాయం చేయలేమంటూ జవాబు వచ్చింది.’ అని రమణ్‌జీత్‌ ‘ఈనాడు’కు తెలిపారు. వాస్తవానికి 104కు సమాచారం అందిస్తే కౌన్సెలింగ్‌ చేసి లక్షణాలను బట్టి 108ను పంపిస్తుంటారు. నిత్యం కేసుల సంఖ్య పెరగడం, ఫోన్ల తాకిడి, అత్యవసర వాహనాలు సైతం ఖాళీ లేకపోవడం వల్ల చాలా సందర్భాల్లో రోగుల వద్దకు చేరేసరికి సుదీర్ఘ జాప్యం చోటుచేసుకుంటోంది. వైద్యారోగ్యశాఖ దృష్టిసారించి ఇటువంటి ఆపద సమయాల్లో సత్వరం సేవలందేలా దృష్టిసారించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని