ప్రత్యేక రైళ్ల స్టాపుల కుదింపు?
close

తాజా వార్తలు

Published : 04/07/2020 01:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రత్యేక రైళ్ల స్టాపుల కుదింపు?

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో కొన్ని ప్రత్యేక రైళ్లను మాత్రమే నడుపుతున్న రైల్వేశాఖ.. ఆయా మార్గాల్లో స్టాపుల్ని తగ్గించేందుకు యోచిస్తోంది. పలు స్టేషన్లలో చాలా తక్కువ మంది ప్రయాణికులు మాత్రమే ఎక్కడం, దిగడం చేస్తున్నారు. కొన్ని స్టేషన్లలో అసలు ఎవరూ ఉండడంలేదు. ఇలాంటిచోట్ల నిర్వహణపరంగా వ్యయప్రయాసలు ఎదురవుతున్నాయని రైల్వేశాఖ చెబుతోంది. ఈ పరిస్థితుల్లో స్టాపుల్ని కుదించేందుకు వెసులుబాటు కల్పించింది. డిమాండ్‌ లేని స్టేషన్లను గుర్తించాలని సంబంధిత జోన్లకు సూచించింది.

సికింద్రాబాద్‌ - పట్నా మధ్య ప్రత్యేక రైలు
ప్రత్యేక రైళ్లను పెంచాలని నిర్ణయించిన రైల్వే శాఖ.. సికింద్రాబాద్‌ - పట్నా, పట్నా - సికింద్రాబాద్‌ మధ్య రెండు రైళ్లు నడపాలని నిర్ణయించింది. వారానికి రెండో రోజులు ఈ రైళ్లు నడుస్తాయి. పరిమిత సంఖ్యలోనే ప్రత్యేక రైళ్లు నడుస్తున్నా, వాటికీ డిమాండ్‌ తక్కువగానే ఉంది. దానాపుర్‌ ఎక్స్‌ప్రెస్‌లో మినహా అనేక రైళ్లలో వందల బెర్తులు ఖాళీగా ఉంటున్నాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని