close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 04/04/2020 09:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments

పీఎం-కేర్స్‌కు నకిలీల బెడద

దిల్లీ: ప్రధాన మంత్రి అత్యవసర పౌర సహాయ, పునరావాస నిధి (పీఎం-కేర్స్‌)కి విరాళాలు కోరుతూ కొందరు నకిలీ యూపీఐ-ఐడీల ద్వారా ప్రజల నుంచి ఆన్‌లైన్‌లో విరాళాలు సేకరిస్తున్నట్టు ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ (సీఈఆర్‌టీ) బృందం హెచ్చరించింది. పీఎం-కేర్స్‌ అసలు ఐడీని పోలిన విధంగా పీఎన్‌బీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యస్‌ బ్యాంక్‌ తదితర బ్యాంకుల యూపీఐ హ్యాండిల్‌ నుంచి నకిలీ ఐడీలను సృష్టించిన విషయం తమ దృష్టికి వచ్చినట్టు తెలిపింది.
pmcares@sbi   మాత్రమే నిజమైన ఐడీ అని పేర్కొంది. దాతలు విరాళాలను అందజేసేముందు ఐడీని సరిచూసుకోవాలని కోరింది.

సీఈఆర్‌టీ పేర్కొన్న నకిలీ ఐడీలు ఇవీ:
pmcares@pnb, pmcares@hdfcbank, pmcare@yesbank, pmcare@ybl, pmcare@upi, pmcare@sbi and pmcare@icici


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.