close

తాజా వార్తలు

Updated : 14/01/2021 08:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమ్మఒడి సొమ్ము కోసం ఆలినే చంపాడు

దేముడమ్మ (దాచిన చిత్రం)

అనంతగిరి, న్యూస్‌టుడే: తాగడానికి అమ్మఒడి సొమ్మును ఇవ్వలేదని భార్యను బండతో కొట్టి చంపాడో కిరాతకుడు. ఈ ఉదంతం అనంతగిరి మండలంలో చోటుచేసుకుంది. ఈ ఘోరానికి సంబంధించి స్థానికులు, ఎస్సై సుధాకర్‌ కథనం ప్రకారం.. గుమ్మకోట పంచాయతీ బురదగెడ్డ గ్రామానికి చెందిన తామల దేముడమ్మ (36), భీమన్న భార్యభర్తలు. వీరికి నలుగురు పిల్లలు. అమ్మఒడి సొమ్ము దేముడమ్మ బ్యాంకు ఖాతాలో జమైంది. మంగళవారం బ్యాంకుకు వెళ్లిన ఆమెపై డబ్బులు విత్‌డ్రా చేయాలని భీమన్న ఒత్తిడి తెచ్చాడు. ఇందుకు ఆమె నిరాకరించటంతో ఇద్దరు ఘర్షణ పడ్డారు. ఇదేరోజు గుమ్మకోట సంతకు వెళ్లారు. ఎంత చెప్పినా డబ్బులు తీసేందుకు ఆమె నిరాకరించింది. కోపగించిన భర్త సంత నుంచి తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో పొలాల వద్ద ఆమెను బండతో కొట్టి హతమార్చాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా మొదట తనకేమీ తెలియదని బుకాయించాడు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో తానే చంపానని అంగీకరించినట్లు ఎస్సై చెప్పారు.Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని