జపాన్‌లో అత్యయికస్థితి ఎత్తివేత!
close

తాజా వార్తలు

Updated : 25/05/2020 23:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జపాన్‌లో అత్యయికస్థితి ఎత్తివేత!

రూ. 70లక్షల కోట్లతో మరో ఉద్దీపన ప్యాకేజీ

టోక్యో: కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనే చర్యల్లో భాగంగా జపాన్‌ అత్యయిక స్థితిని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అక్కడ వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో నిబంధనలు సడలిస్తోంది. తాజాగా టోక్యో నగరంపై ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా భౌతిక దూరంపై ఉన్న ఆంక్షలను కూడా ఈనెల 14నే సడలించింది. ఆ సమయంలో టోక్యోతోపాటు మరో నాలుగు ప్రాంతాలపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించింది. దేశంలో వైరస్‌ తీవ్రత తగ్గడంతో దాదాపు నెలన్నర రోజులు కొనసాగిన అత్యయిక స్థితిని ఎత్తివేయడానికి నిర్ణయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జపాన్‌ కరోనా వైరస్‌ వ్యాప్తిని సమర్థవంతంగా కట్టడి చేయగలిగింది. కేవలం ఇప్పటి వరకు దేశంలో 17వేల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 825 మరణాలు సంభవించాయి. అయితే, కరోనా కట్టడికి తీసుకున్న కఠిన చర్యల ఫలితంగా దేశం ఆర్థిక మాంద్యంలోకి వెళ్లినట్లు ప్రభుత్వం పేర్కొంది.

70లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీ.. 
ఈ సమయంలో ఆర్థికంగా ఆదుకునేందుకు భారీ ప్యాకేజీ ప్రకటించింది. ఈ అత్యయిక స్థితి ఎత్తివేస్తున్న సమయంలో కొత్త తరహా జీవన విధానంతో ముందుకెళ్తూ.. ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించడం ఎంతో ముఖ్యమని జపాన్‌ ఆర్థిక మంత్రి యషుతోషి నిషిమురా అన్నారు. దీనిలో భాగంగా 100ట్రిలియన్‌ యెన్‌ (దాదాపు రూ.70లక్షల కోట్లు)లతో ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు నిషిమురా పేర్కొన్నారు. గత నెలలో కూడా దాదాపు 117ట్రిలియన్‌ యెన్‌ల ప్యాకేజీని జపాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ రెండూ కలిపి జపాన్‌ జీడీపీలో దాదాపు 40శాతం ఉన్నట్లు అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని