
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 5 PM
1. 30 మంది చొప్పున 139 కేంద్రాల్లో వ్యాక్సినేషన్
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి టీకా పంపిణీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో 1,213 వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డా.శ్రీనివాస్ తెలిపారు. మొదటగా శనివారం 139 సెంటర్లలో వ్యాక్సినేషన్ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభిస్తూనే.. త్వరలోనే 1,213 సెంటర్లకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కోఠిలోని ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో డీఎంఈ రమేశ్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ఏపీలో వ్యాక్సిన్ పంపిణీకి సర్వం సిద్ధం
ఆంధ్రప్రదేశ్ కొవిడ్ టీకా పంపిణీకి వైద్య ఆరోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల 87వేల 983 మంది ప్రభుత్వ, ప్రైవేటు వైద్యారోగ్య సిబ్బందికి తొలి విడతలో కరో వ్యాక్సిన్ అందించనున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో 1940 ఆరోగ్య కేంద్రాల్లో తొలి విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఐస్‌లైన్డ్ రిఫ్రిజిరేటర్లు, వాక్ ఇన్ ఫ్రీజర్ గదుల ఏర్పాటు కారణంగా 1659 చోట్ల వ్యాక్సిన్ వయల్స్ కార్టన్లను వైద్యారోగ్యశాఖ భద్రపరిచింది. సమీపంలోని మిగతా కేంద్రాలకు వ్యాక్సిన్‌ను క్యారియర్ బాక్సుల్లో తరలించాలని నిర్ణయించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
* ఏపీలో కొత్తగా 94 కరోనా కేసులు
* ఏపీలో ఓటర్ల తుది జాబితా ఖరారు
3. ఫౌంటెయిన్‌ని తలపించి.. వరదలా ప్రవహించి
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కొహెడ మండలం పరివేద గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకైంది. దీంతో పెద్ద ఎత్తున నీరంతా వృథాగా నేలపాలైంది. విషయం తెలుసుకున్న అధికారులు పైప్‌లైన్ మరమ్మతుల కోసం అక్కడికి చేరుకునే లోపే నీరు వరదను తలపించేలా ప్రవహించింది. ఎట్టకేలకు అక్కడికి చేరుకున్న సిబ్బంది నీటిసరఫరాను నిలిపివేసి మరమ్మతులు చేశారు. నీరు ఫౌంటెయిన్‌లా ఎగిసి పడుతుండటంతో అటువైపుగా వెళ్తున్న వాహనదారులు ఆసక్తిగా తిలకిస్తూ సెల్ఫీలు దిగారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. పోలేపల్లి సెజ్‌లో ఉల్లంఘనలపై విచారణ
తెలంగాణలోని పోలేపల్లి ప్రత్యేక ఆర్థిక మండలిలో పర్యావరణ అనుమతుల ఉల్లంఘనపై ఎన్జీటీలో శుక్రవారం విచారణ జరిగింది. అనుమతులు ఉల్లంఘించిన 9 ఔషధ సంస్థలకు జరిమానా విధించినట్లు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ట్రైబ్యునల్‌కు నివేదించింది. హెటిరో ల్యాబ్స్, శిల్పా మెడికేర్, అరబిందో ఫార్మా, ఏపీఎల్ హెల్త్ కేర్, మైదాన్ లాబొరేటరీస్, ఎవెర్టోజెన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, అమ్నీల్ ఆంకాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు రూ.18.25 లక్షలు, శ్రీకార్తికేయ ఫార్మా కంపెనీకి రూ.9లక్షల జరిమానా విధించినట్లే తెలంగాణ కాలుష్య నియంత్రణమండలి స్పష్టం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. అఖిలప్రియ కేసులో దర్యాప్తు ముమ్మరం
ప్రవీణ్ రావు సోదరుల అపహరణ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సెల్ఫోన్లను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అపహరణ సమయంలో కిడ్నాపర్లతో ఆమె తరచూ మాట్లాడినట్లు పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించారు. ఆమె చరవాణితో పాటు.. అపహరణ సందర్భంగా మాట్లాడేందుకు తాత్కాలికంగా మరో సెల్‌ఫోన్ ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ఫిట్‌గా ఉన్నా.. గుండెపోటు వస్తుందా?
‘జిమ్‌లో కఠినమైన వ్యాయామాలు చేస్తున్నాం కదా. మనకెందుకు గుండెజబ్బులు వస్తాయి?’ అని చాలామంది అనుకుంటుంటారు. నిజమే. శారీరకశ్రమ, వ్యాయామం, ఆటలు శరీర సామర్థ్యాన్ని ఇనుమడింపజేస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు. అంతమాత్రాన గుండెజబ్బులు అసలే రావని అనుకోవటానికి లేదు. ఇటీవల భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ట్రెడ్మిల్ మీద వ్యాయామం చేస్తూ గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఆయన వయసు మరీ పెద్దదేమీ కాదు. మంచి క్రీడాకారుడు. రోజూ జిమ్‌లో వ్యాయామం చేస్తాడు. అయినా గుండెజబ్బు ఎలా వచ్చిందని చాలామంది ఆశ్చర్యపోయి ఉంటారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. మా సహనాన్ని పరీక్షించొద్దు!
గాల్వన్ ఘటనలో అమరులైన 20మంది భారత సైనికుల త్యాగాలు ఎన్నటికీ వృథా కావని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె స్పష్టంచేశారు. శత్రువులు తమ బలాన్ని తక్కువ అంచనా వేయకూడదని.. భారత సైన్యం సహనాన్ని పరీక్షించడానికి ఎవ్వరూ ప్రయత్నించొద్దని హెచ్చరించారు. సరిహద్దుల్లో యథాతథస్థితిని మార్చేందుకు చైనా యత్నించిందని..ఈ సమయంలో చైనాకు భారత సైన్యం దీటుగా సమాధానమిచ్చిందన్నారు. తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఉద్దేశిస్తూ నరవణే ఈవిధంగా మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. కొంప ముంచిన లాభాల స్వీకరణ
దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని భారీ నష్టాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో దేశీయంగా దిగ్గజ షేర్లు కుదేలవడం సూచీల సెంటిమెంట్‌ను దెబ్బకొట్టింది. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం సూచీల పతనానికి కారణమైంది. నేటి సెషన్లో సెన్సెక్స్ 549.49 పాయింట్లు దిగజారి 49,034.67 వద్ద, నిఫ్టీ 161.90 పాయింట్ల నష్టంతో 14,433.70 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 73.07గా కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. తొలి రోజు ఆస్ట్రేలియా 274/5
బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా తొలి రోజు 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. మార్నస్ లబుషేన్(108) శతకం సాధించగా, మాథ్యూవేడ్(45) ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 113 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో తొలిరోజు ఆసీస్‌దే పై చేయిగా నిలిచింది. భారత బౌలర్లలో నటరాజన్ 2 వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకుర్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ తలా ఓ వికెట్ పడగొట్టారు. ఇక ఆట ముగిసే సమయానికి కామెరాన్ గ్రీన్(28*; 70 బంతుల్లో 3x4), కెప్టెన్ టిమ్‌పైన్(38*; 62 బంతుల్లో 5x4) క్రీజులో ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. కేజీయఫ్-2 రోరింగ్.. ఆర్జీవీ పంచ్
బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న ‘కేజీయఫ్’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘కేజీయఫ్-2’ టీమ్‌పై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల విడుదలైన ‘కేజీయఫ్-2’ టీజర్‌కు వస్తోన్న రెస్పాన్స్ పట్ల ఆర్జీవీ స్పందించారు. రెండేళ్ల క్రితం బాలీవుడ్ మాత్రమే కాకుండా దక్షిణాది చిత్రపరిశ్రమ కూడా కన్నడ ఇండస్ట్రీని సరిగ్గా గుర్తించలేదని.. కానీ ‘కేజీయఫ్-2’తో ప్రశాంత్‌నీల్, యశ్ ప్రస్తుతం ఆ పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారని ఆర్జీవీ అభిప్రాయం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
‘కేజీయఫ్-2’ టీజర్ రికార్డు..