నీటి కేటాయింపులపై చట్టబద్ధత కల్పించాలి
close

తాజా వార్తలు

Updated : 23/05/2020 13:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నీటి కేటాయింపులపై చట్టబద్ధత కల్పించాలి

హైదరాబాద్‌: గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా కృష్ణాడెల్టాకు మళ్లించి అక్కడ మిగిలిన నీటిని రాయలసీమకు కేటాయించాలని కోరుతూ గ్రేటర్‌ రాయలసీమ నేతలు శనివారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. ఎంవీ మైసూరారెడ్డి, గంగుల ప్రతాప్‌రెడ్డి, ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీలు దినేశ్‌రెడ్డి, ఆంజనేయరెడ్డితో పాటు 16 మంది గ్రేటర్‌ రాయలసీమ నేతలు సీఎంకు లేఖ రాసిన వారిలో ఉన్నారు. 

రాయలసీమకు గోదావరి జలాలు తీసుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటన చేయడం అభినందనీయమన్న సీమ నేతలు.. ఈ ప్రకటనపై సీఎం జగన్‌ చొరవ తీసుకుని గ్రేటర్‌ రాయలసీమ ప్రాజెక్టులైన హంద్రీనావా, గాలేరు-నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేస్తూ చట్టబద్ధత కల్పించాలన్నారు. బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పుపై సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు అపరిష్కృతంగా ఉన్నాయన్న నేతలు...ఆ తీర్పు గ్రేటర్‌ రాయలసీమ మెడపై కత్తిలాంటిదన్నారు. తెలుగు గంగకు 25 టీఎంసీల నీటిని మాత్రమే కేటాయించారని, హంద్రీనీవా, గాలేరు-నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు చుక్కనీరు కూడా కేటాయించలేదన్నారు. ఆ తీర్పు అమల్లోకి వస్తే ఈ ప్రాజెక్టులన్నీ నిరర్థక ఆస్తులుగా మిగిలిపోతాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముందున్న ప్రత్యా్మ్నాయం గోదావరి జలాలు మళ్లించడమేనన్నారు. పట్టిసీమ, చింతలపూడి ప్రాజెక్టుల ద్వారా ఆదా అయిన నీటిని గ్రేటర్‌ రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించి చట్టబద్ధత కల్పించడం తప్ప మరో దారి లేదన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు గత రెండేళ్లుగా తరలింపు జరుగుతోందన్న రాయలసీమ నేతలు.. ఆ మేరకు కృష్ణా జలాలు ఆదా అవుతున్న మాట వాస్తవమేనన్నారు. ఆదా అవుతున్న కృష్ణా నీటిని గ్రేటర్‌ రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించి ..శాసనసభలో చట్ట బద్ధత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని