ఇతరులకు తనని అద్దెకిచ్చుకుంటున్నాడు!
close

తాజా వార్తలు

Published : 18/01/2021 23:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇతరులకు తనని అద్దెకిచ్చుకుంటున్నాడు!

(ఫొటో: షోజి మొరిమొటో ట్విటర్‌)

ఇంటర్నెట్‌ డెస్క్‌: జీవితంలో ఆర్థికంగా స్థిరపడటానికి సంపాదన అవసరం. అందుకే ప్రపంచంలో అందరూ ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ కష్టపడి సంపాదిస్తుంటారు. కానీ, జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి అసలు ఏ మాత్రం కష్టపకుండానే సంపాదిస్తున్నాడు. ప్రజలు అతడికి పిలుపించుకొని మరీ డబ్బులు ఇస్తున్నారు? ఇంతకీ అతడు ఏం చేస్తున్నాడు అంటే..

జపాన్‌లో అవసరాల్ని బట్టి వైవిధ్యమైన వృత్తులను సృష్టించుకుంటుంటారు. ఇప్పటికే అక్కడ ఒకరి తరఫున తినడానికి, క్షమాపణలు చెప్పడానికి, సమావేశాలకు హాజరుకావడానికి ఇలా విచిత్రమైన ఉద్యోగాలు, వృత్తులు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా మరో వృత్తిని సృష్టించుకున్నాడు టోక్యోకి చెందిన షోజి మొరిమొటో. 37 ఏళ్ల షోజి గతంలో పుస్తక ప్రచురణ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. చేసే పని నచ్చకపోవడంతో మానేశాడు. ఆ తర్వాత తనను తాను మరొకరికి అద్దెకు ఇచ్చుకోవడం మొదలుపెట్టాడు. 

జపాన్‌లో చాలా మంది ఒంటరితనాన్ని అనుభవిస్తుంటారు. అలాంటి వారు ఎవరైనా తోడుగా ఉంటే వారితో తమ సాదకబాధకాలు చెప్పుకోవాలని ఆశిస్తారు. అలాగే, సినిమాలు, షికార్లు, షాపింగ్‌ వంటివాటికి ఒక్కరే వెళ్లలేక ఎవరైనా తోడు ఉంటే బాగుండు అనుకునే వారు ఉంటారు. అలాంటి వారి కోసం తాను సిద్ధంగా ఉన్నట్లు షోజి అంటున్నాడు. ఎవరైనా ఒంటరిగా ఉంటే వారికి ఉచితంగానే తోడుగా వస్తానని 2018లో తొలిసారి సోషల్‌మీడియాలో ప్రకటన చేశాడు. అయితే, తనకు అయ్యే ఖర్చులన్నీ కస్టమరే భరించాలని నిబంధన పెట్టాడు. అయితే చాలా మంది అతడిని తమ వద్దకు రావాలని కోరుతున్నారు. రాను రాను తనకు కస్టమర్లు పెరుగుతుండటంతో ఇటీవల తన సేవలకు రుసుము విధించాడు. ఒక్కరికి కనీసం 10వేల యెన్‌లు ఛార్జ్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం అతడిని రోజుకు కనీసం ఇద్దరు ముగ్గురు అద్దెకు తీసుకుంటున్నారు. 

ఇవీ చదవండి..

ఇంటి నుంచి కాదు.. విదేశాల నుంచి పని చేస్తారా?

దివ్యాంగులకు కోడింగ్‌ నేర్పుతున్నాడు.!


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని