విశాఖ: తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు భవనం కూల్చివేత
close

తాజా వార్తలు

Updated : 25/04/2021 20:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విశాఖ: తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు భవనం కూల్చివేత

విశాఖ: తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు చెందిన బహుళ అంతస్తుల భవనాన్ని జీవీఎంసీ సిబ్బంది కూల్చివేశారు. అనుమతులు లేకుండా కాంప్లెక్స్‌ నడుపుతున్నారంటూ పాత గాజువాక సెంటర్‌లో పల్లాకు చెందిన భవనాన్ని పడగొట్టారు. సమాచారం తెలుసుకుని శ్రీనివాసరావు అక్కడికి చేరుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా భవనాన్ని ఎలా కూల్చివేస్తారని సిబ్బందిని ఆయన ప్రశ్నించారు.  అయితే తాము నోటీసులు ఇచ్చామని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. విషయం తెలుసుకుని స్థానిక తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నాయి. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా భారీగా పోలీసులు మోహరించారు. పల్లా శ్రీనివాస్‌ను బలవంతంగా అక్కడి నుంచి పంపేశారు. 



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని