
తాజా వార్తలు
భరతనాట్యం స్టైల్ బౌలింగ్: చూశారా?
యువరాజ్ సింగ్ షేర్ చేసిన వైరల్ వీడియో
ఇంటర్నెట్ డెస్క్: సామాజిక మాధ్యమాల్లో రకరకాల పోస్టులతో నిరంతరం అభిమానులను ఫిదా చేయటం టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్టైల్. వీటిలో ఫన్నీగా ఉండేవి కొన్నైతే, ప్రేరణ నిచ్చేవి మరి కొన్ని. సరదాగా ఉంటూనే ఆశ్చర్యపరిచేవి మరిన్ని. ఇటువంటిదే ఓ అసాధారణ బౌలింగ్ స్టైల్‌కు సంబంధించిన వీడియోను యువరాజ్ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశాడు. ‘‘భరతనాట్యం స్టైల్ ఆఫ్ స్పిన్!’’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను తన సహచరుడు హర్బజన్ సింగ్‌కు ట్యాగ్ చేశాడు. వివరాలు పూర్తిగా తెలియరానప్పటికీ ఈ వీడియో నెట్టింట్లో చర్చనీయాంశమైంది..
అసలు దీనికి పద్మావత్ హిందీ చిత్రంలోని హిట్ సాంగ్ ‘ఘూమర్’ను నేపథ్యసంగీతంగా పెడితే ఇంకా అదిరిపోతుందని.. బంతి కంటే బౌలరే ఎక్కువగా స్పిన్నైపోతున్నాడని.. నెటిజన్లు ఎన్నో సరదా కామెంట్లు చేస్తున్నారు. 3 లక్షల 17 వేలకు పైగా లైక్స్‌ను సొంతం చేసుకున్న ఈ వీడియో విశేషమేంటో.. మీరూ చూసేయండి!
ఇదీ చూడండి..
అమెరికా భారీకాయుడు.. భారత బాహుబలి