మాస్టారితో చాటింగ్‌... ఆపేదెలా?
close

తాజా వార్తలు

Published : 24/06/2020 08:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాస్టారితో చాటింగ్‌... ఆపేదెలా?

మా పాప ఇప్పుడు పదోతరగతి. ఈ మధ్యే ఆన్‌లైన్‌ క్లాసులు మొదలయ్యాయి తనకు. తరగతులు ముగిసిన తర్వాత పాపతో వాళ్ల మాస్టారు విడిగా మాట్లాడుతూ... వాట్సాప్‌లో చాట్‌ చేస్తున్నాడు. అడిగితే ‘సందేహాలు నివృత్తి చేసుకుంటున్నా’ అంటోంది. పాప ఇలా వ్యక్తిగతంగా మెసేజ్‌లు పెట్టడం మంచిదేనా? ఈ విషయంలో పాపకు నచ్చజెప్పాలా? స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేయాలా?   - ఓ సోదరి
చిన్నారులు ఎక్కువకాలంపాటు విద్యకు దూరమైతే చదువుపట్ల వారిలో అనాసక్తి పెరిగే ప్రమాదం ఉంది. ఇలా జరగకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌ ద్వారా బోధన మంచి నిర్ణయం. ఇందులో భాగంగా స్కూలు యాజమాన్యాలు ఉపాధ్యాయులకు కొన్ని సూచనలను ఇస్తున్నాయి. వాటిని అనుసరిస్తూ వారు విద్యార్థులకు తరగతులు నిర్వహించడం,  విద్యార్థుల సందేహాలు తీర్చడం చేయాల్సి ఉంటుంది.
మీరేం చేయాలంటే.. చిన్నారులు ఆన్‌లైన్‌ తరగతులకు హాజరైనప్పుడు తల్లిదండ్రులు లేదా ఇంట్లో పెద్దవారు వారిని గమనిస్తుండాలి. అలాగని వారి చదువుకు ఆటంకం కలిగించకూడదు. కొంతమంది ఉపాధ్యాయులు బాగా చదివే విద్యార్థులు లేదా తమకు ఇష్టమైన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. విద్యార్థులు కూడా తమకు గుర్తింపు దొరుకుతున్నందుకు సంతోషిస్తారు. మరింత ఉత్సాహంగా ఉంటారు. ఇలాంటప్పుడు వారి మధ్య చనువు పెరగడానికి ఆస్కారం ఎక్కువ. అయితే ఇలా ఎవరో ఒకరి విషయంలో మాత్రమే జరుగుతుండొచ్చు. అలాంటి ఉపాధ్యాయులు తమ తీరు మార్చుకోకపోతే వారి బాధ్యతలను గుర్తు చేయాలి. హద్దులను తెలియజేయాలి. అయినా మార్పు రాకపోతే మేనేజ్‌మెంట్‌కు చెబుతామని సున్నితంగానే హెచ్చరించాలి.
పిల్లలకు ఏం చెప్పాలంటే...  మీరు పిల్లలకు మంచి చెడుల మధ్య తేడాని గుర్తించగలిగే విచక్షణ తెలియచేయాలి. ఉపాధ్యాయులు చదువుకు సంబంధించిన విషయాలు కాకుండా వ్యక్తిగత అంశాలు మాట్లాడుతుంటే వెంటనే మీకు చెప్పమనండి. ఒక వేళ వారి ప్రవర్తన ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే మీకు చెప్పమనాలి. కొందరు చిన్నారులు ఉపాధ్యాయులకు భయపడి వారేమన్నా బయటకు చెప్పరు. అలాగని ప్రతి విషయానికి చిన్నారులను కొట్టడం, తిట్టడం లాంటివి అస్సలు చేయకూడదు. చెప్పినదానికంటే సమయాన్ని పొడిగించినప్పుడు, వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ అతి చనువు తీసుకుంటున్నప్పుడు మేనేజ్‌మెంట్‌తో మాట్లాడండి. ఆ విషయాన్ని ముందుగా పిల్లలతో కూడా చర్చించండి. అయితే ఇదంతా అటు ఉపాధ్యాయులకు కానీ, ఇటు పిల్లలకు కానీ మనసు కష్టబెట్టే విధంగా కాకుండా సున్నితంగా చెప్పాలి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని