close

తాజా వార్తలు

Published : 30/09/2020 21:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఓ అంతర్ముఖుడి ప్రేమ కథ

‘ఏంటి పేపర్‌ సంగతులు?’ అంటూ వెళ్లాడతను. 
‘రావోయ్‌! పేపర్లో ఏముంటాయి... మర్డర్లు, మానభంగాలు, మిస్సింగులు, మీనింగ్‌లెస్‌ స్టేట్‌మెంట్లూనూ..’ అంటూ బదులొచ్చింది. 
పెద్దాయనతో మాట్లాడుతున్నాడే కానీ ఇష్టసఖికోసం కాచుకుని ఉన్నాడతను. ‘నువ్వంటే నాకిష్టం’ అని చెప్పే తెగువ లేని ఆ అంతర్ముఖుడి ప్రేమ కథ ఏ కంచికి చేరింది? సెలయేటి ప్రవాహంలా సాగే ప్రవాహి కథ
నరవాసన... సెప్టెంబర్‌ విపులలో

దేవుడిగదిలోంచి అగరొత్తుల పరిమళం ఉదయానే ఆరోగంటకి టేబిల్‌వాచ్‌ని పరిచయం చేసుకుంటుంది. బదులుగా అలారం మోగుతుంది. అయినా నేను లేవను. కొత్త పెళ్లికూతురు ముస్తాబై గదిలోకి వచ్చినట్లు వచ్చే కాఫీ ఘుమాయింపు నా నాశికలో నాట్యమాడి నన్ను లేపుతుంది.
చాన్నాళ్లుగా ఇంతే! కాఫీ వాసనే నా అలారం! ఆవలింతలకి, ఒళ్లు విరుపులకీ కావాల్సినవేవో చూసీ, రాసీ, ఆనక జీడిపప్పు ఉప్మాని కౌగలించుకుని, నేతిపెనం మీద రుచిపొగలతో పవళిస్తున్న పెసరట్టుపై దౌర్జన్యానికి లంగరెత్తాను. నోరు ఆహా, ముక్కు ఓహో జపం చేస్తూ పెసరట్టు అసలు వారసుల శాసనార్థాలు వినపడనీయలేదు.
అలా టిఫిన్‌ కానిచ్చేసి బయటకెళ్తుండగా అన్నయ్య ఆపాడు. ‘‘ఇవాళ సెలవు, రేపు జాగారం కదా! విశ్వాని కూడా తీసుకురారా! ఇంట్లోనూ, వీధిలోనూ సందడిగా ఉంటుంది. గతేడాది వచ్చాడుగా’’ 

‘‘అలాగేలే’’ నడుస్తూనే చెప్పాను.
‘‘పేక దస్తాలు పట్రండి! అలాగే అమ్మ రాసిచ్చిన సామాన్ల లిస్టూ! మర్చిపోకు’’
‘‘ఊ’’ అనడం వాడికి వినిపించేలా అనలేదు. బైక్‌ స్టార్ట్‌ చేసి ఎల్‌వీజీజే కాలేజ్‌ మీదుగా విశ్వ రూమ్‌వైపు బయల్దేరా.
విశ్వ.. రేండేళ్ల పరిచయం. తానో మేధావినని వాడి ఫీలింగ్‌. దేన్నీ పూర్తిగా విశ్వసించడు. ఎవర్నీ నమ్మడు. ఎందుకంటే ‘రాక్షసులు బుర్రతక్కువ బలశాలురు, దేవుడు ఉపయోగించదగ్గ ఆయుధం- ఈ రెండూ తెలిసిన మనిషే అసలు మాయలమారి!’ అంటాడు. ఎవరైనా కాదని వాదించబోతే ‘ఇన్ని యుగాలైనాయి! దేవుళ్లేరీ? రాక్షసులేరీ? ఉన్నది మానవులేగా’ అంటాడు 
‘నరవాసన నరవాసనంటూ అపుడెపుడో వేటాడి తినే రాక్షసులు గనక ఈ కలియుగంలో ఉంటే స్వార్థం, మోసం, దౌర్జన్యం వంటి గుణాలతో కుళ్లిన నరవాసన భరించలేక ఆత్మహత్యలు చేసుకొందురు కదా!’ అని వివరంగా నరచరిత్రా పారాయణం చేస్తాడు. వాడి దృష్టిలో ప్రేమ ఒక అభూత కల్పన, మోసం మానవుడి ప్రాథమిక గుణం. 
‘‘స్టాప్‌ స్టాప్‌! లైసెన్సుందా బాబూ?’’ ఉద్యమానికి ఊతమంటూ వస్తోన్న పొగని తోసుకుంటూ ట్రాఫిక్‌మామ! 
‘‘లేద్సార్‌’’
‘‘యాభై ఉందా?’’
‘‘సార్, మీకు విశ్వ తెలుసుగా! నేను అతని ఫ్రెండ్‌ని’’
‘‘విశ్వనా, ఎవడు?’’
‘‘స్టేషన్‌ పక్కన గ్రౌండ్‌కి ఈస్ట్‌సైడ్‌.. దయానంద్‌ గారి బంగ్లా..’’
‘‘ఓ.. ఓకే! త్వరగా లైసెన్స్‌ తీస్కో! పై ఊరు వెళ్తే ప్రాబ్లం కదా!’’
‘‘థ్యాంక్యూ సార్‌!’’

👆 పూర్తి కథ చదవడానికి క్లిక్‌ చేయండి... లాగిన్‌ అవ్వండి👆


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.