ఇకపై ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌’అని పిలవరట!
close

తాజా వార్తలు

Updated : 30/09/2020 11:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇకపై ‘లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌’అని పిలవరట!

జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ నిర్ణయం

ఇంటర్నెట్‌ డెస్క్‌: జపాన్‌ విమానాశ్రయాల్లో ప్రయాణికుల విషయంలో అక్కడి ప్రభుత్వం చిన్న మార్పు చేసింది. కరోనా నేపథ్యంలో తీసుకున్న నిర్ణయం కాదిది. ప్రయాణికులను ఉద్దేశించి సంబోధించే అంశంలో తీసుకొచ్చిన మార్పు. సాధారణంగా  ప్రయాణికులకు స్వాగతం పలుకుతూ ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది ‘లేడీస్‌ అండ్‌ జంటిల్‌మెన్‌’అని సంబోధిస్తుంటారు. ఇకపై ఆ విధంగా సంబోధించబోమని జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ తాజాగా ప్రకటించింది. 

ఇటీవల జపాన్‌ ప్రభుత్వం విమానాశ్రయాల్లో ప్రయాణికులకు లింగ, వయసు, జాతి, ప్రాంతీయ భేదం లేని వాతావరణం కల్పించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో స్త్రీ, పురుష లింగ భేదాన్ని ఎత్తిచూపే విధంగా ఉన్న ‘లేడిస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌’ అనే పదాలను తమ ఎయిర్‌లైన్స్‌ ఉపయోగించబోదని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇకపై ప్రయాణికులను ‘ఎవ్రీవన్‌’ లేదా ‘ఆల్‌ ప్యాసింజర్స్‌’ అని మాత్రమే పిలవబోతున్నట్లు తెలిపారు. ‘లేడిస్‌ అండ్‌ జెంటిల్‌మన్‌’అని పిలవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఇప్పటికే జపనీస్‌ భాషలో లింగభేదం చూపించే పదాలను వాడటం నిషేధించారు. వాటికి బదులుగా ఒక్యాకు-సామ(కస్టమర్స్‌), మినా-సమా(ఎవ్రీవన్‌), యోకాకు నొ మినా-సమా(ఆల్‌ ప్యాసింజర్‌) అని ప్రయాణికులను ఉద్దేశిస్తూ సంబోధిస్తున్నారు. ఇప్పుడు ఇంగ్లీష్‌ భాషలో పిలిచే పిలుపులోనూ మార్పులు తీసుకొచ్చారు. అక్టోబర్‌ 1వ తేదీ నుంచే ఇది అమల్లోకి రానుంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని