కొవిడ్‌ ఎఫెక్ట్‌: జపాన్‌లో మరోసారి ఎమర్జెన్సీ!
close

తాజా వార్తలు

Published : 06/01/2021 23:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ ఎఫెక్ట్‌: జపాన్‌లో మరోసారి ఎమర్జెన్సీ!

టోక్యో: కరోనా వైరస్‌ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జపాన్‌ మరోసారి అప్రమత్తమైంది. రాజధాని టోక్యోతో పాటు పరిసర ప్రాంతాల్లో నెలరోజుల పాటు ఎమర్జెన్సీ విధించే అవకాశం ఉన్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. దేశంలో పలు ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అక్కడి ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో టోక్యో, పరిసర ప్రాంతాల గవర్నర్లు ఆరోగ్య ఎమర్జెన్సీ విధించే దిశగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. దీంతో నిపుణుల అభిప్రాయం మేరకు ప్రభుత్వం మరోసారి ఎమర్జెన్సీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

జపాన్‌ రాజధాని టోక్యోలో గతకొన్ని రోజులుగా కేసులు సంఖ్య భారీగా పెరుగుతోంది. వైరస్‌ కట్టడికి చర్యలు తీసుకున్నప్పటికీ పాజిటివ్‌ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. బుధవారం ఒక్కరోజే అక్కడ 1,591 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 59వేలకు చేరింది. వీరిలో 3,609 మంది మృత్యువాతపడ్డారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతూనే ఉంది. జాన్స్‌ హప్కిన్స్‌ యూనివర్సిటీ నివేదిక ప్రకారం.. ఇప్పటివరకు  ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల 65 లక్షల మందిలో వైరస్‌ బయటపడింది. వైరస్‌ బారినపడ్డ వారిలో 18 లక్షల 71వేల మంది ప్రాణాలు కోల్పోయారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని