అంతరిక్షంలో బౌద్ధాలయం..!
close

తాజా వార్తలు

Published : 21/03/2021 01:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంతరిక్షంలో బౌద్ధాలయం..!

టోక్యో: ఇప్పటి వరకు భూమిపై ఉన్న బౌద్ధాలయాల్లో కనిపించే బుద్ధుడు మరికొన్నేళ్లలో అంతరిక్షంలోనూ దర్శనం ఇవ్వనున్నాడు. జపాన్‌లోని క్యోటోలో ఉన్న డయ్‌గోజి దేవాలయంలోని సన్యాసులు అంతరిక్షంలో బౌద్ధ దేవాలయం ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకోసం ఓ శాటిలైట్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీతో కలిసి చేతులు కలిపారు.

టెర్రా స్పేస్‌‌ అనే కంపెనీ శాటిలైట్లను తయారు చేస్తుంటుంది. ఈ కంపెనీ ఓ శాటిలైట్‌లో జొటెనిన్‌ గౌంజీ పేరుతో ఒక దేవాలయాన్ని ఏర్పాటు చేస్తోంది. ఒక చిన్నపాటి డబ్బా రూపంలో ఉండే దేవాలయంలో మండల పెయింటింగ్స్‌ వేసి అందులో చిన్న బుద్ధుడి విగ్రహం పెట్టనున్నారు. దీన్ని శాటిలైట్‌లో పెట్టి అంతరిక్షంలోకి పంపుతారట. 2023లో ఈ దేవాలయం అందుబాటులోకి రానుందని డయ్‌గోజీ దేవాలయానికి చెందిన సన్యాసులు, టెర్రా స్పేస్‌ సంస్థ సంయుక్తంగా ప్రకటన చేశాయి. ఈ ఆలయం నిర్వహణను డయ్‌గోజీ ఆలయ పూజారులు చూసుకుంటారు.

భూమిపైనే భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా తమ ప్రార్థనలను నిర్వాహకులకు పంపిస్తే.. ఆ ప్రార్థనలు అంతరిక్షంలోని శాటిలైట్‌లో ఉన్న దేవాలయానికి పంపిస్తారట. అవి అక్కడ అమర్చిన మెమొరీ డివైజ్‌లో నిక్షిప్తవుతాయట. సాధారణంగా ఒక్క శాటిలైట్‌ తయారు చేసి అంతరిక్షంలోకి పంపడానికి 200 మిలియన్‌ యెన్లు అవసరమవుతాయట. దీంతో ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేవారి కోసం బౌద్ధ సన్యాసులు, టెర్రా స్పేస్‌ ప్రతినిధులు ఆన్వేషిస్తున్నారు. ఆర్థిక వనరులు సమకూరితే అనుకున్న సమయానికి అంతరిక్షంలో దేవాలయం ఏర్పాటవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి..

రియాల్టీ షో విజేతను అంతరిక్షంలోకి పంపుతారట


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని