జపాన్‌: ఒక్క నెలలో 1,805 మంది ఆత్మహత్య
close

తాజా వార్తలు

Published : 13/10/2020 19:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జపాన్‌: ఒక్క నెలలో 1,805 మంది ఆత్మహత్య

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కరోనా కారణంగా మృతి చెందుతున్నవారి పట్ల ఆందోళన చెందుతుంటే.. జపాన్‌ మాత్రం తమ ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన పడుతోంది. అక్కడ కరోనా మృతుల కంటే ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా వచ్చి ఆత్మహత్యల రేటును మరింత పెంచడం జపాన్‌ ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది.

జపాన్‌ ప్రజలు ఎంత కష్టపడతారో అందరికి తెలిసిందే. పొద్దున లేచింది మొదలు.. అర్ధరాత్రి వరకు విధులు నిర్వహిస్తుంటారు. ఉద్యోగాన్ని నిలుపుకోవాలనే తాపత్రయం.. ఎక్కువ పనిచేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ.. వెరసి వారి జీవితమంతా ఉద్యోగంతోనే గడిచిపోతోంది. దీంతో తీవ్ర ఒతిళ్లకు గురవుతున్నారు. వాటిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జపాన్‌ వ్యాప్తంగా గత నెల(సెప్టెంబర్‌)లో 1,805 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడి జాతీయ పోలీస్‌ ఏజెన్సీ వెల్లడించింది. వారిలో 1,166 మంది పురుషులు, 639 మంది మహిళలు ఉన్నారు. గతేడాది సెప్టెంబర్‌ నెలలో ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్యతో పోలిస్తే ఈ సెప్టెంబర్‌లో 8.6శాతం మృతుల సంఖ్య పెరిగిందని పేర్కొంది. పురుషుల్లో 0.4శాతం, మహిళల్లో 27.5శాతం మృతులు పెరిగారట. జులై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లోనే అత్యధిక ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కరోనా సంక్షోభంలో ఉద్యోగాలు కోల్పోయి ఆందోళన చెందుతున్నవారు.. కరోనా సోకడంతో కుటుంబం, స్నేహితులు దూరం పెడుతుండటంతో మనస్తాపానికి గురైనవారు ఎక్కువగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారట. టోక్యోలో అత్యధికంగా 194 మంది ఆత్యహత్య చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జపాన్‌లో 89వేలకుపైగా కరోనా కేసులు నమోదు కాగా.. 81,552 మంది కోలుకున్నారు. 1,631 మంది కరోనా కాటుకు బలయ్యారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని