జననాల రేటు పెంచేందుకు ‌ వినూత్న పథకం
close

తాజా వార్తలు

Updated : 26/10/2020 08:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జననాల రేటు పెంచేందుకు ‌ వినూత్న పథకం

ఇంటర్నెట్‌ డెస్క్‌: మీకు తెలుసుగా.. జపనీయులు పని చేయడానికి ఎంతో ఉత్సాహం చూపుతారు. కార్ఖానాలో అడుగుపెట్టాక పని గంటలను పట్టించుకోరు. తోటి వారితో పోటీపడి తమ పని తీరునీ, ఉత్పాదకతనీ, స్థాయినీ పెంచుకుంటూ పోతుంటారు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో వారి పరిస్థితి విచిత్రంగా తయారైంది. చాలామంది అధిక ఆదాయం కోసం ఆఫీసుల్లో ఓవర్‌డ్యూటీలు, నైట్‌ డ్యూటీలు చేయడమూ అధికమైంది. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకై కొన్ని సంస్థలైతే తక్కువ పని చేయండి అంటూ సూచించాయి. పట్టించుకోని వారిని కొంతకాలం విధులకు దూరంగా ఉండమన్న సందర్భాలూ ఉన్నాయి. అయితే ఎంత కష్టపడినా ఆదాయం పెద్దగా పెరగకపోవడంతో వివాహం చేసుకునేందుకు అక్కడి యువత ఆసక్తి చూపట్లేదు. మరోవైపు ఆ దేశంలో జననాల రేటు దారుణంగా పడిపోతోంది. గతేడాది జపాన్‌లో కేవలం 8.65 లక్షల మందే జన్మించారు. ఇలా జనన రేటు తగ్గిపోవడం అక్కడి ప్రభుత్వాన్ని కలవరపరుస్తోంది. అందుకే ఈ సమస్యకు పరిష్కారంగా జపాన్‌ ఓ వినూత్న పథకాన్ని తీసుకొచ్చింది. 

దేశంలో జననాల రేటు పెరగాలంటే ముందుగా యువతీయువకులు పెళ్లి చేసుకునేలా ప్రోత్సాహించాలని భావించిన జపాన్‌.. పెళ్లి చేసుకునే జంటలకు నగదు బహుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఇటీవల ప్రకటన విడుదల చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి పెళ్లి చేసుకునే జంటలకు ఆరు లక్షల యెన్‌లు  (రూ. 4లక్షలకు పైగా) నగదు బహుమతి ఇస్తామని వెల్లడించింది. పెళ్లి చేసుకున్న జంట కొత్త జీవితం ప్రారంభించడానికి, కొత్తగా ఇల్లు తీసుకొని అద్దె కట్టేందుకు ఈ నగదు ఉపయోగపడుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకంతో వివాహాలు పెరిగి.. ఆయా జంటలు పిల్లల్ని కంటే.. దేశంలో మళ్లీ జననాల రేటు పెరుగుతుందన్నది జపాన్‌ ప్రభుత్వ ఆలోచన. ఈ ప్రోత్సాహకం అందాలంటే వధువు, వరుడు తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకోవాలి. 40ఏళ్ల వయసు మించకుండా, వార్షికాదాయం 5.4 లక్షల యెన్లకు తక్కువగా ఉన్నవారే ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని