close

తాజా వార్తలు

Published : 03/03/2021 17:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కమల్ హాసన్ పోటీ అక్కడినుంచేనా..?

ఎంజీఆర్ అభిమానులను ఆకట్టుకునే ఎత్తుగడతో..

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా మక్కల్‌నీది మయ్యం(ఎంఎన్‌ఎం) అధినేత కమల్‌హాసన్ ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆయన పోటీ చేయబోయే స్థానం గురించిన సమాచారం ఆసక్తిగా మారింది. గతంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎంజీఆర్ ప్రాతినిధ్యం వహించిన అలందూర్ నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. చెన్నైకి సమీపంలోని ఆ ప్రాంతాన్ని పరంగిమలై నియోజవర్గం అని కూడా పిలుస్తారు. 

1967 నుంచి 1976 వరకు ఈ అలందూర్‌ నియోజకవర్గానికి ఎంజీఆర్ ప్రాతినిధ్యం వహించారు. అలాగే ఈ పట్టణ ప్రాంతంలో మక్కల్‌నీది మయ్యం పార్టీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో 10 శాతం ఓటింగ్‌ను సాధించింది. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని కమల్ హాసన్ ఈ నియోజవర్గం నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా..నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన ప్రచారం స్పీడు పెంచారు. ఈ అలందూర్ నుంచే రెండో దశ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. కాగా, మొదట్నుంచి ఆయన ఎంజీఆర్ అభిమానులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నాడీఏంకే(ఏఐఏడీఎంకే) ఎంజీఆర్ అడుగుజాడల్లో నడుస్తుందని చెప్తున్నప్పటికీ, ఆ నేత ఆశయాలను నెరవేర్చలేదని విమర్శిస్తున్నారు. ‘ఎంజీఆర్ పేరును ప్రస్తావించినప్పుడల్లా కొత్త ఉత్సాహం వస్తుంది. మా పార్టీ ట్యాగ్‌లైన్ నాగై నమధే కూడా ఆయన నటించిన ఓ చిత్రం పేరే. ధైర్యంగా ఆయన పేరు పలుకుతాను’ అంటూ మీడియాతో వ్యాఖ్యానించారు. 

మరోవైపు తమిళనాడులోని మరో ప్రధాన పార్టీ డీఎంకే, ఎంఎన్‌ఎం మధ్య పొత్తు ఉంటుందనే ఊహాగానాలను ఇరు పార్టీలు తోసిపుచ్చాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఎంఎన్‌ఎం కొన్ని చిన్న పార్టీలతో పొత్తులు కుదుర్చుకుంటోంది. అలాగే అవినీతి, నిరుద్యోగం, గ్రామాభివృద్ధి వంటి అంశాలను ఎన్నికల ఎజెండాగా మార్చుకొని ప్రజల్లోకి వెళ్తోంది. 

 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని