మహారాష్ట్రలో ఒక్కరోజు 1362 కేసులు
close

తాజా వార్తలు

Published : 07/05/2020 21:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహారాష్ట్రలో ఒక్కరోజు 1362 కేసులు

18 వేలు దాటిన కరోనా బాధితులు

ముంబయి: మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే  1362 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 18,120కి చేరిందని ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపే వెల్లడించారు. ముంబయి నగరంలోని అతిపెద్ద మురికి వాడ అయిన ధారవిలోనూ కొత్తగా మరో 50 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 783కి చేరిందని బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో ఒక్క మరణం కూడా సంభవించకపోవడం ఊరటనిచ్చే విషయం. ముంబయిలోని ఆర్ధర్‌ రోడ్డులోని జైలులో 72 మంది ఖైదీలకు, ఏడుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని మహారాష్ట్ర జైళ్ల శాఖ తెలిపింది.

దేశంలో 50,000+
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,561 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. 89 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య గురువారం ఉదయానికి 52,952కు చేరగా 1,783 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో 15,267మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 35,902 మంది చికిత్స పొందుతున్నారు.

ఏపీలో 51.. తెలంగాణలో 15
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 8,087 శాంపిల్స్‌ పరీక్షించగా 51 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,833కి చేరింది. ఇప్పటి వరకు కరోనా రహిత జిల్లాగా ఉన్న విజయనగరంలోనూ 3 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరోవైపు తెలంగాణలో కొత్తగా ఇవాళ మరో 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో 12 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే కావడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,122కి చేరింది.

గుజరాత్‌లో 388
గుజరాత్‌లో సైతం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 388 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1709కి చేరింది.

ఇవీ చదవండి..
INDIA: భారత్‌లో 1783 మరణాలు

AP: విజయనగరం జిల్లాలో 3 పాజిటివ్‌ కేసులు

TS: తెలంగాణలో మరో 15 కరోనా కేసులు


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని