close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 08/07/2020 15:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా మరణాలు ఎలా దాచగలం?: కేటీఆర్‌

కరీంనగర్‌: ప్రపంచంలో కరోనా బారిన పడని దేశం లేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చే వరకు మొత్తం లాక్‌డౌన్‌ చేసి ఇళ్లలో ఉండలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన కరీంనగర్‌లో మాట్లాడారు. కరోనా వల్ల ఎంతమంది చనిపోతారో తెలియదు గానీ ఆర్థిక ఇబ్బందులతో ఎన్ని ఉద్యోగాలు పోతాయో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారు. ఇంకా ఎక్కువ కాలం లాక్‌డౌన్‌ విధిస్తే ప్రజలు ఉపాధి కోల్పోతారని అన్నారు. అందరికీ జీవితం, జీవనోపాధి ముఖ్యమని పేర్కొన్నారు. కరోనాతో సహజీవనం చేస్తూనే ఉపాధి, అభివృద్ధి సాధించాలని అన్నారు.

కేవలం ప్రభుత్వం మాత్రమే కరోనాకు ఏదో చేయాలని అనుకొనే కంటే.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని కేటీఆర్‌ ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో 23 వేల కేసులు వెలుగుచూస్తే.. మరణాలు 300 వరకే నమోదయ్యాయని కేటీఆర్‌ అన్నారు. అయినా కొంత మంది ఇంకా విమర్శలు చేస్తున్నారని విపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. ఈ సమయంలో రాజకీయాలు చేయడం ఎంతమాత్రం తగదని హితవు పలికారు. పరీక్షలు చేయట్లేదు.. డేటా దాస్తున్నారని అనవసర విమర్శలు చేస్తున్నారని, అదే నిజమైతే మరణాల సంఖ్య ఎలా దాయగలమని ప్రశ్నించారు. అక్కడక్కడా లోపాలు లేవని మాత్రం తాను అనడం లేదని చెప్పారు.  అవి ఎలా సరిదిద్దాలో సూచనలు ఇవ్వాలని విపక్షాలను కోరారు. ఫార్మా రంగం అంటే కాలుష్యం అనే అపవాదం ఉందని, కానీ, మన రాష్ట్రం నుంచి పని చేస్తున్న నాలుగు ఫార్మా కంపెనీలు ప్రస్తుతం దూసుకుపోతున్నాయని కేటీఆర్‌ అన్నారు. ప్రస్తుతం 78 శాతం వైద్య పరికరాలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, అందులో మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.