జాతీయ వృద్ధి 8.09... టీఎస్‌ వృద్ధి 17.97
close

తాజా వార్తలు

Published : 20/06/2020 20:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జాతీయ వృద్ధి 8.09... టీఎస్‌ వృద్ధి 17.97

ఐటీ రంగంలో అద్భుత ప్రగతి సాధించాం

తెలంగాణ మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణలో ఐటీ రంగం అద్భుతమైన ప్రగతిని సాధించిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్ర ఐటీశాఖ ప్రగతి నివేదికను మంత్రి విడుదల చేశారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘ఐటీ రంగం వృద్ధిలో జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు ఎక్కువగా ఉంది. ఐటీ ఎగుమతుల జాతీయ వృద్ధి 8.09 శాతమైతే రాష్ట్రంలో 17.97 శాతం నమోదైంది. దేశ ఐటీ ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 10.61 శాతం నుంచి 11.58 శాతానికి పెరిగింది’’ అని చెప్పారు. 

‘‘ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాంగణాన్ని అమెజాన్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. మైక్రాన్‌ సంస్థ అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని మన రాష్ట్రంలో ప్రారంభించింది. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరిస్తున్నాం. వరంగల్‌కు టెక్‌ మహీంద్రా, సైయంట్‌ కంపెనీలు వచ్చాయి. సుమారు 250కిపైగా కంపెనీల వల్ల 1.16 లక్షల మందికి నేరుగా ఉపాధి లభిస్తోంది. రాష్ట్ర ఎలక్ట్రానిక్స్‌ విభాగం ₹ 7,337 కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చింది. టీఎస్‌ డిజిటల్‌ వ్యాలెట్‌ ద్వారా ₹6,795 కోట్ల నగదు బదిలీలు జరుగుతున్నాయి’’ అని కేటీఆర్‌ తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని