
తాజా వార్తలు
ప్రతి జిల్లా కేంద్రంలో శిల్పారామం: శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని పల్లె సంస్కృతి శిల్పారామంలో కనిపిస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మాదాపూర్ శిల్పారామంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో మంత్రి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా శిల్పారామంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, గంగిరెద్దుల విన్యాసాలు తిలకించారు. అనంతరం అక్కడ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణలోని ప్రతి గ్రామంలో పచ్చదనం సంతరించుకుంటుందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో హైదరాబాద్ తరహా శిల్పారామాలు ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి వెల్లడించారు.
ఇవీ చదవండి..
30 మంది చొప్పున 139 కేంద్రాల్లో వ్యాక్సినేషన్
వ్యాక్సినేషన్.. ఈ రూల్స్ మర్చిపోవద్దు
Tags :