
తాజా వార్తలు
ఫౌంటెయిన్‌ని తలపించి.. వరదలా ప్రవహించి
కొహెడ: తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కొహెడ మండలం పరివేద గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకైంది. దీంతో పెద్ద ఎత్తున నీరంతా వృథాగా నేలపాలైంది. విషయం తెలుసుకున్న అధికారులు పైప్‌లైన్ మరమ్మతుల కోసం అక్కడికి చేరుకునే లోపే నీరు వరదను తలపించేలా ప్రవహించింది. ఎట్టకేలకు అక్కడికి చేరుకున్న సిబ్బంది నీటిసరఫరాను నిలిపివేసి మరమ్మతులు చేశారు. నీరు ఫౌంటెయిన్‌లా ఎగిసి పడుతుండటంతో అటువైపుగా వెళ్తున్న వాహనదారులు ఆసక్తిగా తిలకిస్తూ సెల్ఫీలు దిగారు.
ఈ ప్రాంతంలో భగీరథ పైపుల లీకేజీ ఇటీవల తరచుగా జరుగుతున్నాయి. అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎక్కడో ఒక చోట లీకేజీలు ఏర్పడుతూ మంచి నీరు వృథాగా పోతోందని స్థానికులు అంటున్నారు.
ఇవీ చదవండి..
శంషాబాద్-చికాగో నాన్‌స్టాప్ విమాన సేవలు
వ్యాక్సినేషన్.. ఈ రూల్స్ మర్చిపోవద్దు
Tags :