టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయాలి: లోకేశ్‌
close

తాజా వార్తలు

Updated : 18/04/2021 14:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయాలి: లోకేశ్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తు్న్న సమయంలో పదోతరగతి, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కోరారు. ఈమేరకు ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు. పరీక్షల వల్ల కొవిడ్‌ సోకితే కొందరు విద్యార్థులు ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదముందని లేఖలో పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న అనిశ్చితి, ఆందోళన, ఒత్తిడి నివారించడానికి పరీక్షలు రద్దు చేయటమే ఉత్తమమని సూచించారు. కేంద్రం సీబీఎస్‌ పరీక్షలు రద్దు చేసిందని, తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి, ఇంటర్‌ మొదటి ఏడాది పరీక్షలు రద్దు చేసి, ఇంటర్‌ రెండో ఏడాది పరీక్షలు వాయిదా వేసిందని గుర్తు చేశారు.  జూన్‌లో మన రాష్ట్రంలో 15లక్షలకు పైగా విద్యార్థులు పదోతరగతి, ఇంటర్‌ పరీక్షలు రాయాల్సి ఉందని, వేచి చూసే ధోరణికంటే విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వటం ఉత్తమమని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీకా పంపిణీ రేటు ఘోరంగా ఉన్న సమయంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం తగదని హెచ్చరించారు. రాష్ట్రంలో టీకా సామర్థ్యం పెరిగే వరకు కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని లోకేశ్‌ డిమాండ్ చేశారు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని