బ్రెజిల్‌ ప్రయాణికుల్లో మరో కొత్త స్ట్రెయిన్‌?
close

తాజా వార్తలు

Published : 11/01/2021 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బ్రెజిల్‌ ప్రయాణికుల్లో మరో కొత్త స్ట్రెయిన్‌?

జపాన్‌ ఆరోగ్యశాఖ వెల్లడి

టోక్యో: కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతున్నా కొద్దీ.. కరోనా వైరస్‌ కొత్తరకం వైరస్‌లు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా బ్రెజిల్‌ నుంచి వచ్చిన వారిలోనూ కొత్తరకం వేరియంట్‌‌ గుర్తించినట్లు తాజాగా జపాన్‌ వెల్లడించింది. బ్రిటన్‌, దక్షిణాఫ్రికా దేశాల్లో బయటపడిన వేరియంట్‌ కంటే ఇది భిన్నమైనదని జపాన్‌ ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. మొత్తం నలుగురిలో కొత్త రకం మ్యుటేషన్‌ గుర్తించగా, ఈ మూడింటిలో ఒకే విధమైన మ్యుటేషన్‌ ఉన్నట్లు తెలిపింది. అయితే, ఈ కొత్తరకం తీవ్రత ఎక్కువగా ఉందనడానికి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలూ లభించలేదని తెలిపింది. వైరస్‌ లక్షణాలతో పాటు దానిపై వ్యాక్సిన్‌ ప్రభావం ఎలా ఉంటుందన్న విషయంపై పరిశోధన కొనసాగుతోందని జపాన్‌ జాతీయ అంటువ్యాధుల కేంద్రం చీఫ్‌ తకజీ వకీట తెలిపారు.

ఇక ఇప్పటికే బ్రిటన్‌లో వెలుగుచూసిన వైరస్‌తో సహా ఇప్పటివరకు మొత్తం నాలుగు రకాల వైరస్‌లు గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వీటిలో బ్రిటన్‌ వేరియంట్‌ అత్యంత తీవ్రతో వ్యాపిస్తున్నట్లు నిపుణులు ఇప్పటికే స్పష్టంచేశారు. భారత్‌లోనూ ఈ బ్రిటన్‌ రకం వైరస్‌ కేసులు 90కి చేరాయి.

20 లక్షల డోసులు ఇవ్వండి..
కరోనా వైరస్‌ తీవ్రతకు బ్రెజిల్‌ వణికిపోతోంది. ఇప్పటికే అక్కడ 80 లక్షల మందిలో వైరస్‌ బయటపడగా, 2 లక్షల మంది మృత్యువాతపడ్డారు. దీంతో అక్కడి ప్రజలకు వ్యాక్సిన్‌ అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మనదేశంలో తయారవుతున్న కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ 20లక్షల డోసులు కావాలని బ్రెజిల్‌ కోరింది. ఇక్కడి వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ఆంటంకం లేకుండానే, తమకు 20లక్షల డోసుల పంపించాలని బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశాను.  

ఇవీ చదవండి..
కొవిడ్‌ మూలాలు: ఏడాదైనా మిస్టరీగానే..!
చైనా నగరాల్లో లాక్‌డౌన్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని