కరోనా: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
close

తాజా వార్తలు

Published : 20/06/2020 16:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు నానాటికీ విజృంభిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 499 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 6,526కు చేరింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  సచివాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. మరోవైపు పీఈసెట్‌ దరఖాస్తుల గడువు ఈనెల 30 వరకూ పొడిగిస్తూ ఉన్నత విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త మార్గదర్శకాలు ఇవే..!

* ప్రభుత్వ కార్యాలయాల్లో 50శాతం సిబ్బంది హాజరుకావాలి. 

* రొటేషన్‌ విధానంలో 50శాతం సిబ్బంది మాత్రమే పనిచేయాలి. 

* విడిగా చాంబర్లు ఉన్నవారు రోజూ రావాల్సిందే.

* డ్యూటీ లేని ఉద్యోగులు హెడ్‌క్వార్టర్స్‌ను విడిచి వెళ్లొద్దు. 

* గర్భిణీలు, ఇతర వ్యాధులతో బాధపడేవారు సెలవులను ఉపయోగించుకోవాలి.

* అధికారుల డ్రైవర్లు పార్కింగ్‌లో కాకుండా పేషీలో ఉండాలి. 

* ఉన్నతాధికారుల అనుమతి లేనిదే సందర్శకులను కార్యాలయాల్లోకి అనుమతించకూడదు. 

* బీఆర్‌కే భవన్‌లో నాలుగో తరగతి ఉద్యోగులకు వారం విడిచి వారం విధులు.

* ఈనెల 22 నుంచి జులై 4వ తేదీ వరకూ ఆదేశాలు అమల్లో ఉంటాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని