
తాజా వార్తలు
సాహితీవేత్త రుద్రశ్రీ కన్నుమూత
జనగామ టౌన్: తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేసుకున్న జనగామ పట్టణానికి చెందిన అభ్యుదయ కవి డాక్టర్ రుద్రశ్రీ(89) అలియాస్ చిట్టిమల్ల శంకరయ్య శుక్రవారం అనారోగ్యంతో స్వగృహంలో కన్నుమూశారు. 1972 నుంచి స్థానిక ఏబీవీ డిగ్రీ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తూ..1996లో ఉద్యోగవిరమణ చేశారు. రుద్రశ్రీ 1954 నుంచి సాహిత్యరంగంలో పలు రచనలు చేశారు. అరాత్రికం, ఇంద్రచాపం, విశ్వసుందరి, బర్డ్ ఆఫ్ ప్యారడైజ్, రూపాయి ఆత్మకథ తదితర కవితా సంపుటాలను రచించారు. రుద్రశ్రీ మృతికి జనగామకు చెందిన కవులు లింగంపల్లి రామచంద్ర, డాక్టర్ తిరునగరి, కందుల సత్తెయ్య, సోమేశ్వర చారి తదితరులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
Tags :