నేను వ్యాక్సిన్‌ తెప్పిస్తే మీరెందుకు?: చంద్రబాబు
close

తాజా వార్తలు

Updated : 10/05/2021 17:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నేను వ్యాక్సిన్‌ తెప్పిస్తే మీరెందుకు?: చంద్రబాబు

అమరావతి: సీఎం జగన్‌ ప్రజలకు వ్యాక్సిన్‌ అందించకుండా బాధ్యతల నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాలు సొంతంగా వ్యాక్సిన్‌ కోసం ఆర్డర్‌ పెట్టినా ఏపీ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయలేదని ఆక్షేపించారు. ఆన్‌లైన్‌ ద్వారా తెదేపా ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కొవిడ్‌ కారణంగా  ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో 18-45 ఏళ్ల యువతకు కూడా వ్యాక్సిన్‌ వేస్తుంటే.. ఏపీలో మాత్రం ఇవ్వడం లేదన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్లు కూడా పిలిచిందని గుర్తు చేశారు.

అడ్వాన్స్‌లు చెల్లించకుండా కేవలం లేఖలు రాస్తే వ్యాక్సిన్లు ఎలా సరఫరా చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. తాను వ్యాక్సిన్‌ తెప్పిస్తే మరి జగన్‌ ఎందుకు సీఎంగా ఉండటమని మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించేలా లోకేశ్‌, ధూళిపాళ్ల, దేవినేని ఉమ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితర తెదేపా నేతలపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌.. ఆ రాష్ట్రంలో అమ్మ క్యాంటీన్లు కొనసాగించాలని తీసుకొన్న నిర్ణయం అభినందనీయమని చెప్పారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని