‘విజయసాయి సేవకులే నా భవనం కూల్చారు’
close

తాజా వార్తలు

Published : 27/04/2021 00:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘విజయసాయి సేవకులే నా భవనం కూల్చారు’

జీవీఎంసీ అధికారులపై తెదేపా నేత ఫిర్యాదు

విశాఖ: గాజువాకలో తన భవనాన్ని కూల్చి వేసిన జీవీఎంసీ అధికారులపై తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాజువాక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నా భవనాన్ని విజయసాయిరెడ్డి సేవలకు కూల్చివేశారు. జీవీఎంసీ అధికారులను విజయసాయి సేవకులుగానే చూస్తా. వాళ్లు జీవీఎంసీ అధికారులైతే నాకు ముందుగా నోటీసు ఇచ్చి ఉండాలి. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి రాత్రి కర్ఫ్యూ సమయంలో వచ్చారు. బలవంతంగా నా ప్రాంగణంలోకి చొరబడి నిర్మాణాన్ని కూల్చారు. పార్టీ మారాలని నాకు ఆహ్వానం పంపారు. నాకు కొన్ని పద్ధతులు ఉన్నందునే హుందాగా వ్యవహరించా. పార్టీ అంటే కేవలం అవసరాల కోసం మార్చేది కాదు’’ అని అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని