‘అధికారపక్షం తప్పులు చెప్పకూడదా?’
close

తాజా వార్తలు

Published : 01/07/2020 19:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అధికారపక్షం తప్పులు చెప్పకూడదా?’

డీజీపీ కలిసిన తెదేపా నేతలు

అమరావతి: ‘‘వేధింపులకు గురిచేస్తున్న ప్రభుత్వం మూల్యం చెల్లించుకోకతప్పదు. ఎస్సీలపై దాడులను ఏ మాత్రం సహించం’’ అని తెదేపా నాయకులు అన్నారు. గురజాలలో విక్రమ్‌ను హత్య చేసినవారిపై చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను కలసి కోరారు. ఆ తర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ ‘‘మా ఆరోపణలపై సమాధానం చెప్పలేక వైకాపా నేతలు పారిపోతున్నారు. బెదిరింపులు, ప్రలోభాలతో ఎవరినీ భయపెట్టలేరు. ఇకనైనా కక్షసాధింపు చర్యలు మానుకోవాలి. అధికారపక్ష నేతలు చేస్తున్న తప్పులను చెప్పకూడదా. అణచివేత ధోరణి ఎన్నాళ్లు కొనసాగిస్తారు’’ అని తెదేపా నాయకులు ప్రశ్నించారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని