రైతులకు సంకెళ్లు సిగ్గుచేటు: ఆనందబాబు
close

తాజా వార్తలు

Updated : 30/10/2020 13:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రైతులకు సంకెళ్లు సిగ్గుచేటు: ఆనందబాబు

గుంటూరు: రాజధాని రైతుల అరెస్టులు, చేతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ గుంటూరులో తెలుగుదేశం పార్టీ నేతలు నిరసన దీక్ష చేపట్టారు. వైకాపా ప్రభుత్వం అవలంభిస్తున్న నిరంకుశ విధానాలను వ్యతిరేకిస్తూ గుంటూరు వసంతరాయపురంలో తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు క్యాంపు కార్యాలయంలో చేతులకు బేడీలు వేసుకుని నిరసన తెలిపారు. 

ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ... ప్రభుత్వ అరాచకాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. అన్నం పెట్టే రైతులకు సంకెళ్లు వేయడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. అమరావతి ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వమే పెయిడ్‌ ఆర్టిస్టులతో ఉద్యమానికి తెరతీసిందన్నారు. ఇదేంటని ప్రశ్నించిన రైతులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా అమరావతిలో ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం దారుణమన్నారు. రైతులపై ఫిర్యాదు చేసిన వ్యక్తి కేసు విత్‌డ్రా చేసుకుంటానని చెబితే పోలీసులు పట్టించుకోకుండా కక్షపూరితంగా దసరా రోజు రైతులను అరెస్టు చేశారని ఆరోపించారు. రాజధాని నిర్మాణం కోసం 33వేల ఎకరాలు ఇచ్చిన రైతుల చేతులకు బేడీలు వేసి అవమానిస్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసినా రైతులు మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతారన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించే వరకు పోరాటం ఆగదని ఆనంద్‌బాబు స్పష్టం చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని