కొవిడ్‌ బాధితులకు ఉచితంగా మందులు: చంద్రబాబు
close

తాజా వార్తలు

Updated : 30/04/2021 12:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ బాధితులకు ఉచితంగా మందులు: చంద్రబాబు

అమరావతి: నిరుపేదలైన కొవిడ్‌ బాధితులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. హోం ఐసోలేషన్‌లో ఉండి స్వల్ప లక్షణాలతో బాధపడే వారికి ఆన్‌లైన్‌ ద్వారా వైద్య సలహాలు అందివ్వనున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారు ఆన్‌లైన్‌లో తమ ఇబ్బందులను వైద్యులకు చెబితే అవసరమైన మందులు సూచిస్తారన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. కరోనా నుంచి అంతా విముక్తి పొందాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్లాస్మా డొనేషన్ చేపడతామని పేర్కొన్నారు. కొవిడ్‌ లక్షణాలు ఎక్కువగా ఉన్నవారిని ఆస్పత్రుల్లో చేర్పించే ప్రయత్నం చేయనున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకునేలా పార్టీ పరంగా తోడ్పాటు ఇవ్వనున్నట్లు తెలిపారు. అధికారంలో ఉన్నా లేకున్నా ఆపదలో ఉన్నవారికి నిరంతర సేవలు అందించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని